కేసిఆర్ దీక్ష తోనే తెలంగాణ వచ్చింది.!దీక్ష దివాస్ ముగింపు కార్యక్రమంలో హోం మంత్రి.!
హైదరబాద్ : చంద్రశేఖర్ రావు దీక్షా దివస్ ముగింపు దినాన్ని పురస్కరించుకొని హైదారాబాద్ లోని హజ్రత్ యుసిఫైన్ దర్గాలో గురువారం నాడు రాష్త్ర హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రార్థనలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజల సంక్షేమం కోసం హోంమంత్రి ప్రార్ధనలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 9 వ తేదీన చంద్రశేఖర్ రావు తన 11 రోజుల నిరసనను విరమించారని అన్నారు. దీక్ష ప్రారంభ తేది నవంబర్ 29 నుండి 11 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్షేమ, విద్యా, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక తదితర కార్యక్రమాల అనంతరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ మసీదుల పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

మసీదు అంటే అల్హా ఇల్లు అని, రాజకీయాలు చేసే స్థలం కాదని హోం మంత్రి పేర్కొన్నారు. రెండు మసీదుల ప్రారంభోత్సవం తర్వాతనే సచివాలయాన్ని ప్రారంభిస్తానని చంద్రశేఖర్ రావు ముస్లింలకు హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఇప్పటికే మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని రెండు మసీదులను వాటి పురాతన మరియు పూర్వ స్థలంలో నిర్మిస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు. మసీదులపై కాంగ్రెస్ నేతలు నిరాధారమైన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ముఖ్యంగా ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. సచివాలయంలోని రెండు మసీదులను యథాతథ స్థలంలోనే నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి కల్వ కంట్ల చంద్రశేఖర్‌రావు హామీ మేరకు మసీదు, గుడి, చర్చి ప్రారంభించిన తర్వాతే సచివాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.
Recommended Video













Click it and Unblock the Notifications