సతీసమేతంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నూతన అధికారిక నివాసంలోకి అడుగుపెట్టారు. ఈరోజు మధ్యాహ్నాం గ్రామ దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం సతీసమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ సందర్బంగా పలువురు బంధుమిత్రులు గృహప్రవేశానికి హాజరయ్యారు.

గృహప్రవేశానంతరం కొత్త క్యాంప్ ఆఫీస్ లో సైతం ప్రత్యేక పూజలు నిర్వహించారు సీఎం కేసీఆర్. అదే సమయంలో క్యాంప్ ఆఫీస్ ఆవరణలో పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, గ్రీన్ ల్యాండ్స్ లోని సీఎం క్యాంపు కార్యాలయానికి వాస్తు ప్రకారం పలు మార్పులు చేర్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఇటీవలే పనులన్నీ పూర్తయిపోవడం.. ఈరోజు మంచి ముహూర్తం కావడంతో.. నూతన గృహప్రవేశం చేశారు కేసీఆర్.












Click it and Unblock the Notifications