పక్కరూమ్ లోనే భార్య, మైనర్ బాలికపై లైంగికదాడి, ఎక్కడంటే?
కంచే చేను మేసింది. అనాధలను అక్కునచేర్చుకొంటామని ఏర్పాటుచేసిన ఆశ్రమ నిర్బాహకుడే 14 ఏళ్ళ మైనర్ బాలికపై లైంగిక దాడికి దిగాడు. ప్రతిరోజూ ఈ వేధింపులు భరించలేక ఆ బాలిక స్కూల్లో టీచర్లకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: కంచే చేను మేసింది. అనాధలను అక్కునచేర్చుకొంటామని ఏర్పాటుచేసిన ఆశ్రమ నిర్బాహకుడే 14 ఏళ్ళ మైనర్ బాలికపై లైంగిక దాడికి దిగాడు. ప్రతిరోజూ ఈ వేధింపులు భరించలేక ఆ బాలిక స్కూల్లో టీచర్లకు ఫిర్యాదు చేసింది. స్కూల్ టీచర్లు రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ శాఖకు ఫిర్యాదు చేశారు.
హైద్రాబాద్ ఎల్ బి నగర్ లో జాడీ మాధవరావు ఆదరణ ఛైల్డ్ కేర్ హోమ్ ను ఏర్పాటుచేశారు. 8వ, తరగతి చదువుతున్న బాలిక మూడేళ్ళ క్రితం ఈ ఛైల్డ్ కేర్ సెంటర్ లో చేరింది. మూడేళ్ళ క్రితం తన తల్లి చనిపోవడం, తండ్రి మరో వివాహం చేసుకోవడంతో ఆ బాలిక ఛైల్డ్ కేర్ సెంటర్ లో చేరింది.

ఆమె సరూర్ నగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది.అయితే ఇటీవల ఆమె స్కూల్ లో టిసి కోసం వెళ్ళింది. టిసి ఎందుకని టీచర్లను ఆమెను ప్రశ్నించారు. అయితే ఛైల్డ్ కేర్ సెంటర్ నిర్వాహకుడు మాధవరావు ప్రతిరోజు తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆ బాలిక టీచర్లకు చెప్పింది.
దీంతో స్కూల్ టీచర్లు రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ శాఖకు ఫిర్యాదుచేశారు.ఈ మేరకు అధికారులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మాధవరావు తనను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆ బాలిక పోలీసులకు వివరించింది. భార్య, తల్లి పక్క రూమ్ లో నిద్రించే సమయంలో మాధవరావు తనపై లైంగికదాడికి పాల్పడేవాడని బాధితురాలు పోలీసులకు వివరించింది.
మాధవరావుపై ఎల్ బి నగర్ పోలీసులు కేసు పోస్కో చట్టం కింద కేసును నమోదుచేశారు. నింబోలిఅడ్డాలో ప్రభుత్వం నిర్వహించే ఛైల్డ్ కేర్ సెంటర్ కు తరలించారు.












Click it and Unblock the Notifications