వైఎస్ మృతిపై వార్తాకథనం: జగన్ చానల్ ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు
హైదరాబాద్: దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి వెనుక రిలయెన్స్ హస్తం ఉందంటూ వార్తా కథనాలను ప్రసారం చేసి, ఆ సంస్థ ఆస్తుల నష్టానికి కారణమైందనే ఆరోపణలపై జగన్ చానల్‌ను ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని తెలంగాణ సీఐడీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
వైయస్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ వైఎస్ మరణించిన కొద్ది నెలలకు జగన్ టీవీ సహా టీవీ-5, ఎన్‌టీవీ చానళ్లు కథనాలను ప్రసారం చేశాయి. ఈ నేపథ్యంలో వైఎస్ అభిమానులు రిలయన్స్ సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకులు, ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఆ మూడు టీవీ చానళ్లపై 153-ఏ(దేశద్రోహం) కింద కేసు నమోదు చేసింది.

ఈ కేసును సీఐడీ దర్యాప్తునకు చేపట్టింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ సీఐడీ ఈ బాధ్యతలు చేపట్టింది. వైఎస్ అభిమానులు ధ్వంసం చేసిన రిలయన్స్ ఆస్తుల విలువ రూ.12 కోట్లుగా సీఐడీ విభాగం అంచనా వేసింది. అయితే... తెలంగాణలో కె. చంద్రశేఖర రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీవీ-5, ఎన్‌టీవీ చానళ్లు తమను ఆ కేసు విచారణ నుంచి తప్పించాలని కోరుతూ లేఖలు రాశాయి.
జగన్ టీవీలో వచ్చిన కథనాల ఆధారంగానే తమ చానళ్లలో కథనాలు ప్రసారం చేశామని, జగన్ టీవీ కథనాలు నిజమో? కాదో? నిర్ధారించుకోకుండా వేయడం తప్పేనంటూ క్షమాపణలు చెప్పాయి. దీంతో ఆ రెండు చానళ్లను కేసు విచారణ నుంచి తప్పించాలని నిర్ణయించారు. ఇది జరిగిన తర్వాత జగన్ టీవీ కూడా సీఎం కేసీఆర్‌కు లేఖ రాసింది.
దేశద్రోహం కేసు నుంచి తమను తప్పించాలని కోరింది. అయితే, ఆ కేసు వ్యవహారాలు చూస్తున్న తెలంగాణ సీఐడీ విభాగం ఇందుకు అంగీకరించలేదు. దేశద్రోహం కేసు నుంచి తప్పించడం కుదరదని కేసీఆర్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఈ కేసులో జగన్ టీవీ సీఈవో, ఎడిటర్, ఇద్దరు జర్నలిస్టులు నిందితులుగా ఉన్నారని సీఐడీ తెలిపింది.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications