విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలోని విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించిన రూ. 365.75 కోట్ల స్కాలర్ షిప్ బకాయిలను ఆర్థికశాఖ తాజాగా విడుదల చేసింది. వీటిల్లో ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ. 152.59 కోట్లు, అలాగే బీసీ సంక్షేమ శాఖకు రూ. 21.62 కోట్లు నిధులను విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత ప్రభుత్వ హయాం నుంచి పెండింగ్ లో ఉన్న బకాయిలన్నీ పూర్తిగా విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా విద్య విషయంలో రాజీ పడేది లేదని పేర్కొన్నారు.

తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆయా శాఖలకు సంబంధించిన స్కాలర్ షిప్ బకాయిలను ఆర్థిక శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు రూ.365.75 కోట్లను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో అత్యధికంగా ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 191. 63 కోట్లు, అలాగే గిరిజన సంక్షేమ శాఖకు రూ. 152. 59 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ. 21.62 కోట్లు నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలన్నీ పూర్తిగా విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రీ మెట్రిక్ స్కాలర్​షిప్ లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం విద్యార్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తుది గడువును డిసెంబర్ 31 వరకు నిర్ధారించింది. ఎస్సీ విద్యార్థులకు ప్రస్తుత విద్యా సంవత్సరం 2025-26కి గానూ ఈ ఉపకార వేతనాలను త్వరలో ఖాతాల్లో జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

Telangana Clears 365 75 Cr Scholarship Arrears for BC SC ST Students

ఇక ఈ స్కాలర్ షిప్ లను రాష్ట్ర ప్రభుత్వం ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అందిస్తోంది. బాలికలకు ఏడాదికి రూ.1,500, బాలురకైతే రూ.1,000 చొప్పున అందిస్తోంది. ఒకసారి మంజూరు అయితే 10 తరగతి దాకా స్కాలర్ షిప్ అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ ఏడాది మొత్తంగా 3,014 మందికి స్కాలర్​ షిప్ లను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. విద్యార్థులు డిసెంబర్ 31వ తేదీలోపు https://telanganaepass.cgg.gov.in/ వెబ్​ సైట్ లో అప్లై చేసుకోవాలని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+