సాయిచంద్ పార్థీవదేహానికి కేసీఆర్ నివాళి, భావోద్వేగం, కేటీఆర్, హరీశ్ రావు కంటతడి
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ పార్థీవదేహానికి సీఎం కేసీఆర్ నివాళుర్పించారు. గుర్రంగూడలోని నివాసానికి వెళ్లిన కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు సీఎం కేసీఆర్. సాయిచంద్ భార్య, పిల్లలు కేసీఆర్ కాళ్లపై పడి రోదించారు.
ఈ క్రమంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం సాయిచంద్ తండ్రి వెంకట్రాములును ఓదార్చారు. తానున్ననంటూ వారికి కేసీఆర్ భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. సాయిచంద్ పార్థీవదేహానికి మంత్రి హరీశ్ రావు నివాళులర్పించిన సందర్భంలో భావోద్వేగానికి గురై కంటతడిపెట్టారు. కాగా, కేసీఆర్‌తో పాటు మంత్రులు హరీశ్‌రావు, సబిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు , బీఆర్ఎస్తో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజాసంఘాల నాయకులు సాయిచంద్‌కు నివాళులర్పించారు.

మరోవైపు, పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు, రాజకీయ, ప్రజా సంఘాల నేతలు సాయిచంద్ పార్థీవదేహానికి నివాళులర్పించారు. సాయిచంద్ పార్థీవదేహానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేవపతి శ్రీనివాస్ తదితరులు నివాళుర్పించారు. సాయిచంద్ కుటుంబసభ్యులను ఓదారుస్తూ కేటీఆర్ కంటతడి పెట్టారు. కుటుంబసభ్యులకు అండగా ఉంటామన్నారు.

అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో తన అరుదైన కళానైపుణ్యం, గాత్రంతో అలరించిన తమ్ముడు సాయిచంద్ మరణం చాలా బాధాకరమని అన్నారు. ఉద్యమ సహచరుడి మృతి తీరని లోటన్నారు. సాయిచంద్ హైదరాబాద్‌లో ఉంటే బతికేవాడేమో.. స్వగ్రామానికి వెళ్లడం.. అక్కడే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. సాయిచంద్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేటీఆర్ అన్నారు. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. సాయిచంద్ లేడని ఊహించుకుంటేనే బాధగా ఉందన్నారు. చిన్న వయస్సులోనే సాయిచంద్ చనిపోవడం దురదృష్టకరమన్నారు. ఆయన పాట ఖండాంతరాలు దాటిందన్నారు. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ సాయిచంద్ ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సీఎం సంతాపాన్ని ప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా… pic.twitter.com/P8vgt3gXjN
— Telangana CMO (@TelanganaCMO) June 29, 2023
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన సాయిచంద్‌కు బుధవారం రాత్రి గుండెపోటు వచ్చింది. నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి.. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
అశ్రునివాళి..#SaiChand pic.twitter.com/Cu0T8h7hrm
— Jithender Rao Kodati (@KJRBRS) June 29, 2023
మృతి విషయం తెలిసిన వెంటనే మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పార్టీ నేతలు పెద్దఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. సాయిచంద్ మృతిపట్ల గవర్నర్ తమిళిసై సంతాపం తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాద్ శివారులోని గుర్రంగూడలోని నివాసానికి తరలించారు. వనస్థలిపురం సాహెబ్‌నగర్ శ్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications