కెసిఆర్ మొక్కు, శ్రీవారి రూ.5 కోట్ల హారం సిద్ధం: బైక్, ట్రాక్టర్ విరాళం
హైదరాబాద్/చిత్తూరు: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి తెలంగాణ ప్రభుత్వం కానుకగా ఇవ్వనున్న స్వర్ణ సాలగ్రామ హారం తయారీ పూర్తయింది. రూ.5 కోట్లతో ప్రత్యేక ఆభరణం తయారీ చేయించే బాధ్యతలను తెలంగాణ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కి అప్పగించింది.
తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఆభరణాల తయారీ కంపెనీ ద్వారా సాలగ్రామ హారాన్ని టిటిడి తయారు చేయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే శ్రీవారికి స్వర్ణ కానుకలు ఇస్తామని ఉద్యమ సమయంలో సీఎం కెసిఆర్ మొక్కుకున్నారు. ఆభరణం తయారీని టిటిడి తెలియజేయగానే, కెసిఆర్ స్వయంగా దానిని అందిస్తారు.
మరోవైపు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోమవారం సాయంత్రం పలువురు దాతలు వాహనాలను విరాళంగా ఇచ్చారు. రూ.18 లక్షలకు పైగా విలువ చేసే ట్రాక్టర్ ఒకటి, రూ.2 లక్షలకు పైగా విలువ చేసే మూడు ద్విచక్ర వాహనాలు టిటిడికి అందించారు.

కెసిఆర్
తెలంగాణ ఉద్యమం సమయంలో... ప్రస్తుత తెలంగాణ సీఎం కెసిఆర్ శ్రీవారికి మొక్కుకున్నారు. తెలంగాణ ఏర్పడితే స్వర్ణ కానుకలు ఇస్తామని ఆయన మొక్కుకున్నారు. ఇప్పుడు మొక్కు తీర్చుకుంటున్నారు.

ట్రాక్టర్, బైక్ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానంకు (టిటిడి) సోమవారం సాయంత్రం పలువురు దాతల నుంచి మొత్తం రూ.22 లక్షల విలువ గల విరాళాలు అందుకుంది.

ట్రాక్టర్, బైక్ విరాళం
టిఎఎప్ఎఫ్ కంపెనీ చీఫ్ మల్లికా శ్రీనివాసన్ ఓ ట్రాక్టర్‌ను విరాళంగా ఇచ్చారు. దీని విలువ రూ.18 లక్షల వరకు ఉంటుంది.

ట్రాక్టర్, బైక్ విరాళం
టిఎఎప్ఎఫ్ కంపెనీ చీఫ్ మల్లికా శ్రీనివాసన్ ఓ ట్రాక్టర్‌ను విరాళంగా ఇచ్చారు. దీని విలువ రూ.18 లక్షల వరకు ఉంటుంది.

ట్రాక్టర్, బైక్ విరాళం
టీవీఎస్ మోటార్స్ చీఫ్ శ్రీ శ్రీనివాసన్ రూ.2 లక్షలకు పైగా విలువ చేసే మూడు ద్విచక్ర వాహనాలను శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. దాతలు వీటిని జెఈవో శ్రీనివాస రాజుకు అందించారు.












Click it and Unblock the Notifications