దేశం దారి తప్పుతోంది.. రక్తాన్ని ధారపోసైనా చక్కదిద్దుతా ! : సీఎం కేసీఆర్
దేశం దారి తప్పుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గమైన వ్యవస్థను నడుస్తోంది. దీనిని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. జనం అసహ్యించుకునేలా పనులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు పేరిట విద్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఆరాచకాలను అంతం చేయాల్సిన అవసరం ఉన్నారు.

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా..
ఈ దేశాన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు సీఎం కేసీఆర్. దేశంలో ఉన్నాం కాబట్టి వందకు వంద శాతం ముందుకు పోవాలని నిర్ణయిం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దీనికి అనుగుణంగా దేశ రాజకీయల్లో పెను మార్పులు తీసుకువస్తానని స్పష్టం చేశారు. ఆ దిశగా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకు సాగుతున్నట్లు కేసీఆర్ తేల్చిచెప్పారు. ఆరునూరైనా ఈ దేశాన్ని మంచి మార్గంలో పెట్టేందుకు దేవుడి తనకు ఇచ్చిన శర్వశక్తులను ఉపయోగస్తానని చెప్పారు. తన చివరి రక్తపు బొట్టు ధారపోసైనా ఈ దేశాన్ని చక్కదిద్దుతానని తెలిపారు..

మతాల పేరిట చిచ్చు దేశానికి ప్రమాదం..
సిద్దిపేట జిల్లాలో మలన్న సాగర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మత కల్లోలాలు, గొడవలు, ఉంటే పరిశ్రమలు రావన్నారు. కర్ణాటక వెళ్లి చదువుకోవాలంటే పిల్లులు భయపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతాల పేరిట చిచ్చుపెట్టడం మంచిది కాదన్నారు. ఇలాంటి ప్రమాదకరమైన వాటిని సహింకూడదు. వీటిని దేశం నుంచి తరిమికొట్టాలన్నారు. ప్రజలకు చేటు చేసేవారిని నిలదీసి సమర్థవంతంగా ఎదుర్కొవాలన్నారు.

సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి..
తెలంగాణలో అన్ని విధాల అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు కేసీఆర్. నాటి పాలకుల వలన బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా మారిందని అన్నారు. హైదరాబాద్ నుంచి లక్షా 50వేల కోట్ల సాప్ట్‌వేర్ ఎగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి రోజు 500 వరకు విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు. ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. దేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా ఎకరం భూమి 20 లక్షలకు పైగా ఉందన్నారు. రైతులకు అన్ని విధాల టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందన్నారు.
Recommended Video

ప్రతిపక్షాలు మారాలి..
రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఇప్పటికైనా మారాలన్నారు. ప్రభుత్వంపై విమర్శలు మాని తెలంగాణలో ఉన్న పరిస్థితులను , పక్క రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను పరిశీలించాలని హితవు పలికారు. ఐటీ ఉద్యోగాలు చేసేవారు కూడా నేడు గ్రామాలకు వస్తున్నారని అభిప్రాయపడ్డారు. కుక్కులు మెరుగుతున్నాయని పనిని ఆపేది లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో అద్భుతమై గ్రామీణ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications