హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Raj Bhavan కు KCR: గవర్నర్‌ తమిళిసైతో భేటీ: ప్రధాని, ఎంకే స్టాలిన్ సందేశం

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌లు రాష్ట్ర‌వ్యాప్తంగా నిరాడంబ‌రంగా జ‌రిగాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిథులు జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ప్ర‌జ‌ల‌కు తెలంగాణ రాష్ట్రావతర‌ణ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌న అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గ‌న్‌పార్క్ వ‌ద్ద‌ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళి అర్పించారు.

తీరు మారని అనంతపురం ఆసుపత్రులు: కలెక్టర్ ఏం చెబుతున్నారు?: సున్నా నుంచి వందల్లోతీరు మారని అనంతపురం ఆసుపత్రులు: కలెక్టర్ ఏం చెబుతున్నారు?: సున్నా నుంచి వందల్లో

క‌రోనా వేళ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జెండా వందన కార్యక్రమాలన్నీ నిరాడంబరంగా కొనసాగాయి. ఆయా కార్యక్రమాలకు పరిమిత సంఖ్యలో ఆహ్వానితులు హాజరయ్యారు. అనంతరం కేసీఆర్ సోమాజీగూడలోని రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్లారు. గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇవ్వాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ పుట్టినరోజు కావడంతో ఆమెకు పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Telangana CM KCR greets Governor Tamilisai on her birth day at Raj Bhavan in Hyderabad

ఈ సందర్భంగా కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి తదితరులు ఉన్నారు. వారందరినీ కేసీఆర్ గవర్నర్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై.. శాలువా కప్పి కేసీఆర్‌ను సన్మానించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం వారిద్దరు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.

రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు.. ఈ ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను కేసీఆర్.. ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సినేషన్‌ గురించి వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్‌డౌన్‌ను మరో దఫా పొడిగించామని చెప్పారు. లాక్‌డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయిన వారి సంక్షేమానికి అమలు చేస్తోన్న చర్యలను ప్రస్తావించారు.

కాగా- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ కూడా గవర్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ సందేశాన్ని పంపించారు. తమిళసై సౌందరరాజన్ సొంత రాష్ట్రం తమిళనాడే. ప్రస్తుతం ఆమె పుదుచ్చేరికి కూడా ఇన్‌ఛార్జ్ లెప్టినెంట్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురు ట్విట్టర్ ద్వారా తమిళిసై గ్రీటింగ్స్ చెప్పారు.

English summary
Telangana Chief Minister K Chandra Sekhar Rao on Wednesday greeted to Governor Dr Tamilisai Soundararajan on her birth day at Raj Bhavan in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X