హైద్రాబాద్ రండి, బిర్యానీ పెడ్తాం: ఫడ్నవీస్‌తో కెసిఆర్, ఏపీతో మంచి సంబంధాలే
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహా నీటి పారుదల శాఖ మంత్రి, అధికారులు అందరు కూడా హైదరాబాద్ రావాలని, వస్తే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ బిర్యానీ పెడతామని తెలంగాణ రాష్ట్ర సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం చెప్పారు.
తమకు పొరుగు రాష్ట్రాలన్నింటితోను సత్సంబంధాలు కావాలని, ఏ రాష్ట్రంతోను కొట్లాడబోమని చెప్పారు. మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్... ఇలా అన్నింటితోను మంచి సంబంధాలే కోరుకుంటున్నామని చెప్పారు. గోదావరి నది పైన ఐదు బ్యారేజీల నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కెసిఆర్ పైవ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్ విద్యాసాగర రావులకు కెసిఆర్ ధన్వయాదాలు తెలిపారు. గోదావరి నీళ్లు చాలా ఉన్నాయని, మనం మనం గొడవపడితే ప్రయోజనం ఉండదని, కొన్ని నీళ్లు మహారాష్ట్ర వాడుకుంటే కొంత మనం వాడుకుందామని చంద్రబాబు చెప్పారన్నారు.
మంగళవారం ముంబైలో మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్య చారిత్రక ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహ్యాద్రి అతిథి గృహంలో భేటీ అయ్యారు.

కేసీఆర్‌తోపాటు మంత్రులు హరీష్‌రావు, జోగు రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా సమావేశంలో ఉన్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఒప్పంద (ఎంవోయూ) పత్రాలపై సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఇరువురు సీఎంలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు.
ఈ ఒప్పందంతో...
ఈ ఒప్పందం ద్వారా నాలుగు దశాబ్దాల సమస్యకు పరిష్కారం విషయంలో ముందడుగు పడింది. ఈ ఒప్పందం పరిధిలోకి పెన్ గంగ, ప్రాణహిత, లెండి, గోదావరి నది పైన నిర్మించనున్న అయిదు ప్రాజెక్టులు రానున్నాయి.

లోయర్ పెన్ గంగలోతెలంగాణలో ఒక బ్యారేజీ, మహారాష్ట్రలో రెండు బ్యారేజీలు నిర్మించనున్నారు.
తుమ్మిడిహెట్టి ఎత్తు 148 మీటర్లు, మేడిగడ్డ వద్ద 103 మీటర్లు ఉండనుంది.
లోయర్ పెన్ గంగలో చనాకా, కొరాటా బ్యారేజీ (తెలంగాణ) నిర్మాణం.
గత ప్రభుత్వాల ఒప్పందాలు, తాజా ఒప్పందాలు అన్నీ అంతర్రాష్ట్ర బోర్డు పరిధిలోకి వచ్చేలా నిర్ణయం.
సాంకేతిక సమస్యల పైన అంతర్రాష్ట్ర బోర్డు నిర్ణయం తీసుకునేలా ఒప్పందం.












Click it and Unblock the Notifications