Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుటుంబ సమేతంగా చినజీయర్ స్వామి ఆశ్రమానికి సీఎం కేసీఆర్... ఆ ప్రాజెక్టుపై ఆరా...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమాన్ని సోమవారం(అక్టోబర్ 11) కుటుంబ సమేతంగా సందర్శించారు.రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్ ఆశ్రమానికి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌,ఆయన కుటుంబ సభ్యులకు వేద‌పండితులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం కేసీఆర్‌,ఆయ‌న కుటుంబ స‌భ్యులు చిన‌జీయ‌ర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. చినజీయర్ స్వామి శాలువాతో కేసీఆర్‌ను సత్కరించారు. ఆశ్రమంలోని జీవ ప్రాంగ‌ణంలో ఉన్న కుటీరంలో చిన‌జీయ‌ర్ స్వామితో కేసీఆర్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భ‌గ‌వ‌త్ రామానుజ‌చార్య ప్రాజెక్టు వివ‌రాల‌ను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటీర ప్రాంగణంలో కేసీఆర్ మొక్క‌లు నాటారు.

రామానుజ స‌హ‌స్రాబ్ది ఉత్స‌వాల సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 5న చినజీయర్ ఆశ్రమంలో స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, పలువురు కేంద్ర‌మంత్రులు, ఆయా రాష్ట్రాల సీఎంల‌ను చిన‌జీయ‌ర్ స్వామి ఆహ్వానించిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 18న ప్రముఖ పారిశ్రామికవేత్త మైహోం రామేశ్వరరావుతో కలిసి చినజీయర్ స్వామి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భగవత్‌ రామానుజాచార్యుల సహస్రాబ్దీ ఉత్సవాలకు, స‌మ‌తామూర్తి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు హాజ‌రు కావాలని ప్ర‌ధాని మోదీని చిన‌జీయ‌ర్ స్వామి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సహస్రాబ్ది మహోత్సవాల విశిష్టతను మోదీకి చిన‌జీయ‌ర్ స్వామి వివరించారు. 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. చినజీయర్ ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన మోదీ కార్యక్రమానికి తప్పక హాజరువతానని తెలిపారు.

telangana cm kcr meets chinnajeeyar swamy at his ashram along with his family members

శంషాబాద్ ముచ్చింతల్‌లోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో వచ్చే ఫిబ్రవరిలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 216 అడుగుల రామానుజాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.మొత్తం 200 ఎకరాల్లో రూ.1000 కోట్లతో సమతామూర్తి దివ్యక్షేత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు విగ్రహావిష్కరణ ఉత్సవాలు జరపనున్నారు. ఈ సందర్భంగా 35 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేయనున్నారు. ఇందుకోసం 2లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగించనున్నారు.ఈ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సమతామూర్తి దివ్యక్షేత్రం

థాయ్‌లాండ్‌లో ఉన్న బుద్ద విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దది కాగా ముచ్చింతల్‌లో ఏర్పాటు చేయబోయే రామానుజ విగ్రహం రెండో అతిపెద్దదిగా చెబుతున్నారు. భారత దేశంలో ఇదే అతిపెద్ద విగ్రహంగా చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని పంచలోహాలతో చైనాలో తయారు చేయిస్తున్నారు. 1100 టన్నుల బరువుండే ఈ భారీ విగ్రహ ఏర్పాటు నిమిత్తం భద్రవేది పేరుతో పీఠం ఏర్పాటు చేస్తున్నారు. దానిపై పద్మపీఠం నిర్మిస్తున్నారు. పద్మపీఠంపై రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మొత్తం నిర్మాణం ఎత్తు 216 అడుగులు కాగా.. ఇందులో భద్రవేది పీఠం ఎత్తు 54 అడుగులు, పద్మపీఠం ఎత్తు 27 అడుగులు, త్రిదండం పొడవు 135 అడుగులు ఉంటాయి. పద్మపీఠంలో రామానుజ విగ్రహం ఎత్తు 108 అడుగులు ఉంటుంది. 200 ఏళ్ల వరకూ చెక్కుచెదరకుండా ఉండేలా విగ్రహాన్ని తయారుచేయించి ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇది కాక.. రామానుజాచార్యులవారు ఈ భూమిపై 120 ఏళ్లు జీవించిన గుర్తుగా దివ్యక్షేత్రంలో 120 కిలోల బంగారు రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అత్యాధునిక మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 108 దివ్యదేశాల (వైష్ణవ క్షేత్రాల) నమూనాలను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఈ దివ్యక్షేత్ర నిర్మాణానికి అవసరమైన 45 ఎకరాల స్థలాన్ని మైహోం సంస్థ అధినేత రామేశ్వరరావు దానం చేశారు. మొదటి దశ పనులు నవంబర్‌ నాటికి పూర్తికానున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+