విభజన సమస్యలు, ఉమ్మడి వద్దు: హోంమంత్రితో కెసిఆర్, ప్రణబ్‌కి ఆహ్వానం(పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బుధవారం కలిసి విభజన సమస్యలపై చర్చించారు.
రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా హైకోర్టును విభజించకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి కెసిఆర్ తీసుకొచ్చారు. దీనివల్ల తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయమే మళ్లీ జరుగుతోందని వివరించారు.
వీలైనంత త్వరగా రాష్ట్ర హైకోర్టు విభజన పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఉమ్మడి హైకోర్టును వీలైనంత త్వరగా విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న సిఎం కెసిఆర్ విజ్ఞప్తిపై ఆయన పైవిధంగా స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కెసిఆర్, బుధవారం రాజ్‌నాథ్‌తో సమావేశమై విభజనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారని టిఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపి వినోద్‌కుమార్ తెలిపారు.
రాష్ట్రం విడిపోయి ఏడాదిన్నర కావొస్తున్నా హైకోర్టును విభజించకపోవడం వల్ల పలు సమస్యలు వస్తున్నాయని, తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయమే ఇప్పుడూ జరుగుతోందని రాజ్‌నాథ్‌కు కెసిఆర్ వివరించారు. తెలంగాణ వారిని న్యాయమూర్తులుగా నియమించటంలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయటం వలన పలు సరిహద్దు సమస్యలు ఎదురవుతున్నాయని, వాటినీ పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను సిఎం కోరినట్టు వినోద్‌కుమార్ చెప్పారు. ఏడు మండలాను ఆంధ్రలో విలీనం చేయటం వలన భద్రాచలం వెళ్లాలంటే ఆంధ్ర ద్వారా ప్రయాణం చేయాల్సివస్తోంది. దీని వలన పలు సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీమేరకు తెలంగాణ శాసన సభ సీట్ల సంఖ్యను పెంచాల్సిందిగా చంద్రశేఖరరావు హోంమంత్రిని కోరారు. శాసన సభ సీట్ల సంఖ్య పెంచేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సిఎం కోరారు. రాష్ట్ర విభజన సమస్యలను హోంశాఖ చిత్తశుద్ధితో పరిష్కరించాలని వినోద్‌కుమార్ చెప్పారు. విభజన సమస్యల పరిష్కారం బాధ్యత హోంశాఖపై ఉందన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య నోడల్ సంస్థగా వ్యవహరిస్తోన్న హోంశాఖ విభజన సమస్యలను పరిష్కరించకుంటే ఎదురయ్యే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చే నెలలో జరుగనున్నాయి. గతంలో మాదిరిగానే విభజన సమస్యలు, ముఖ్యంగా హైకోర్టు విభజన అంశాన్ని ఉభయ సభల్లో లేవదీస్తామని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలను హోంమంత్రి దృష్టికి తెచ్చామన్నారు.
తెలంగాణకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కెసిఆర్ హోంమంత్రిని కోరానన్నారు. హైదరాబాదు, సైబరాబాద్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఉందన్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇకమీదట ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా తమ పనిని ముగించాలన్నారు. మరో 13 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నందున ఐఏఎస్, ఐపీఎస్‌ల కొరత మరింత పెరుగుతుంది కనుక సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు వినోద్‌కుమార్ చెప్పారు.
విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10లోని అంశాల గురించీ రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారని వినోద్‌కుమార్ వివరించారు. లోక్‌సభలో తెరాస పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపీ వినోద్‌కుమార్, డిజిపి అనురాగ్ శర్మ ఉన్నారు.

హోంమంత్రితో కెసిఆర్
రాష్ట్ర విభజన జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా హైకోర్టును విభజించకపోవడం వల్ల పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి కెసిఆర్ తీసుకొచ్చారు. దీనివల్ల తెలంగాణకు గతంలో జరిగిన అన్యాయమే మళ్లీ జరుగుతోందని వివరించారు.

హోంమంత్రితో కెసిఆర్
వీలైనంత త్వరగా రాష్ట్ర హైకోర్టు విభజన పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

హోంమంత్రితో కెసిఆర్
ఉమ్మడి హైకోర్టును వీలైనంత త్వరగా విభజించి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న సిఎం కెసిఆర్ విజ్ఞప్తిపై ఆయన పైవిధంగా స్పందించారు.

హోంమంత్రితో కెసిఆర్
ఢిల్లీ పర్యటనలో ఉన్న కెసిఆర్, బుధవారం రాజ్‌నాథ్‌తో సమావేశమై విభజనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారని టిఆర్ఎస్ సీనియర్ నేత, ఎంపి వినోద్‌కుమార్ తెలిపారు.

ప్రణబ్‌కి ఆహ్వానం
కేంద్రహోంమంత్రితో సమావేశం అనంతరం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. ప్రణబ్‌ముఖర్జీ సతీమణి ఇటీవల కాలం చేసిన నేపథ్యంలో ఆయనను పరామర్శించారు.

ప్రణబ్‌కి ఆహ్వానం
రాష్ట్రంలో పరిస్థితులు, సమస్యలు ప్రణబ్‌కు వివరించారు. చండీయాగానికి రావాలని ఆహ్వానించారు.

క్యాంప్ ఆఫీస్‌కు కెసిఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం బుధవారం సాయంత్రం తిరిగి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంది.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ: చండీయాగానికి ఆహ్వానం
కేంద్రహోంమంత్రితో సమావేశం అనంతరం కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. ప్రణబ్‌ముఖర్జీ సతీమణి ఇటీవల కాలం చేసిన నేపథ్యంలో ఆయనను పరామర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు, సమస్యలు ప్రణబ్‌కు వివరించారు. చండీయాగానికి రావాలని ఆహ్వానించారు. న్యాయమంత్రి సదానందగౌడ, పర్యావరణ మంత్రి జవదేకర్‌తో ముఖ్యమంత్రి భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వారిద్దరూ ఢిల్లీలో లేకపోవడంతో వీలు కాలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం బుధవారం సాయంత్రం తిరిగి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంది. నవంబర్ 5న ప్రధానితో సమావేశంముఖ్యమంత్రి కేసీఆర్ నవంబరు 5న ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు సమయం కోరినట్లు సమాచారం. వచ్చేనెలలో మూడు రోజుల పర్యటనకు కేసీఆర్ ఢిల్లీకి రానున్నారు.
రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, సమస్యలు ఎదుర్కొన్న తీరును ప్రధానికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. విభజనకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పరిపాలన పరంగా ఎదురయ్యే ఇబ్బందులు కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.
కాగా, నవంబర్ 3న కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో జరిగే తీవ్రవాద ప్రాబల్య రాష్ట్రాల సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. 4న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొంటారు. బీహార్ ఎన్నికలు పూర్తికానున్న నేపథ్యంలో మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేసీఆర్ పర్యటన షెడ్యూలు ఖరారు అవుతున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications