పాలకుడు ధార్మికుడైతే రాజ్యం సస్యశ్యామలం: ఆయుత చండీయాగానికి రూ.7 కోట్లు!
మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెదక్ జిల్లా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల పాటు ఈ యాగం నిర్వహిస్తారు. ఈ యాగానికి రూ.7 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
రెండు వందల ఏళ్లలో దక్షిణాదిన ఇది రెండో ఆయుత చండీయాగం. కెసిఆర్ నిర్వహిస్తున్న ఈ యాగానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రుత్విక్కులు పాల్గొంటున్నారు. పదిహేను వందల మంది రుత్విక్కులు యాగంలో పాల్గొంటున్నారు.

108 హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఆయుత చండీయాగం నేపథ్యంలో ఫాంహౌస్ వద్ద పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఈ యాగం 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. గవర్నర్ నరసింహన్ నిన్న పాల్గొన్నారు.
ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. రూ.6 నుంచి రూ.7 కోట్లు ఖర్చువుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాగంపై విమర్శలు చేస్తున్న వారు లేకపోలేదు. అయితే, అందరి క్షేమం కోసమే ఆయుత చండీయాగం నిర్వహిస్తున్నట్లు టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పాలకుడు ధార్మికుడైతే రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుందనే వారూ ఉన్నారు.












Click it and Unblock the Notifications