• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆ న‌మ్మ‌కంతో తెలంగాణ సీయం కేసీఆర్ కి బాగా "వాస్తుంది.. !!

|

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏ ప‌ని చేసినా ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌తో చేస్తారు. తాను ఎంచుకున్న ప‌నిలో ఏ చిన్న లోపం క‌నిపించినా ఆ ప‌నిని ఆర్ధాంత‌రంగా ఆపేస్తారు. అది వ్యక్తిగ‌త కార్య‌క్ర‌మం ఐనా., అదికారిక కార్య‌క్ర‌మం ఐనా కేసీఆర్ కు ప‌క‌డ్బందీ లెక్క ఉండాల్పిందే..! ఇటీవ‌ల తెలంగాణ‌లోని ప్ర‌తి జిల్లాలో పార్టీ కార్యాల‌యాలు ఉండాల‌ని, పార్టీకి సంబందించిన స‌మావేశాలు అక్క‌డే జ‌ర‌గాలని ముఖ్య‌మంత్రి హుకుం జారీ చేసారు. దీంతీ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాల‌యాల నిర్మాణం జోరందుకుండి. గులాబీ బాస్ నియోజ‌క వ‌ర్గం గ‌జ్వేల్ లో కూడా అన్ని హంగుల‌తో పార్టీ కార్యాల‌య నిర్మాణం వేగంగా పూర్త‌య్యింది. కాని ముఖ్య‌మంత్రి ఇంత‌వ‌ర‌కూ ఆ కార్య‌ల‌యం వైపు తొంగి చూడ‌ లేదు.. అంత ఖ‌ర్చు పెట్టి ఎంతో వేగంగా నిర్మించిన కార్యాల‌యాన్ని ముఖ్య‌మంత్ని కేసీఆర్ ఒక్క‌సారి కూడా సంద‌ర్శించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటి..? ఆ కార‌ణంతోనే ఆ కార్యాలయంలో అడుగు పెట్ట‌డానికి కేసీఆర్ జంకుతున్నారా..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

జిల్లాకో టీఆర్ఎస్ భ‌వ‌న్..! గులాబీ బాస్ హుకుమ్..!!

జిల్లాకో టీఆర్ఎస్ భ‌వ‌న్..! గులాబీ బాస్ హుకుమ్..!!

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును వాస్తు భయం వెంటాడుతోంది.వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అభివ్రుద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే పని చేయవన్న నమ్మకానికి ఆయన వచ్చినట్లు కనిపిస్తోంది. అద్రుష్టం కూడా కలిసి రావాలని భావిస్తున్న ఆయన వాస్తును అత్యంత బలంగా నమ్ముతున్నారు. వాస్తు సరిగా లేదన్న కారణం చూపిస్తు కేసీఆర్ గత వెయ్యి రోజుల నుంచి సెక్రటేరియట్ లో అడుగుపెట్టడం మానేశారు.సరైన వాస్తుతో సికింద్రాబాద్‌ లో నూతన సచివాలయ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే సమయంలో వాస్తు భయంతోనే ఇప్పటికే ఉన్న సి.ఎం క్యాంపు ఆఫీసును పక్కన పెట్టి ప్రగతి భవన్ ను ఆయన నిర్మించారు.

 పార్టీ కార్య‌క్ర‌మాలు అక్క‌డే..! నాయ‌కుంలంద‌రూ అక్క‌డే..!

పార్టీ కార్య‌క్ర‌మాలు అక్క‌డే..! నాయ‌కుంలంద‌రూ అక్క‌డే..!

ప్రస్తుతం ఆయన ఆ భవనంలో నుంచి బయటకు రాకుండా పాలన కొనసాగిస్తున్నారు.ఏ పని చేసినా ముహుర్తంతో పాటు వాస్తు చూస్తు చంద్రశేఖర్ రావు ముందుకు నడుస్తున్నారు. కేసీఆర్ ఈ వైఖరీపైన తీవ్ర విమర్శలున్నాయి.అయినప్పటికి ఆయన మాత్రం మారడం లేదు.తాజాగా చంద్రశేఖర్ రావు వాస్తు భయంలో మరో భవనం చేరిపోయింది.ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఆ కార్యాలయంలోకి ఆయన ఇప్పటి వరకు అడుగు కూడా పెట్టలేదు. భవిష్యత్తులో కూడా వళ్లే అవకాశాలు కనిపించడం లేదు.రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక కార్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తోంది.

కేసీఆర్ కార్య‌ల‌యానికి వాస్తు దోషం..! అందుకే అడుగు పెట్టం..!!

కేసీఆర్ కార్య‌ల‌యానికి వాస్తు దోషం..! అందుకే అడుగు పెట్టం..!!

రెండు అంతస్తుల ఈ భవనంలో కింద కార్యాలయం, పైన ఎమ్మెల్యే నివాసాన్ని ఏర్పాటు చేస్తున్నారు.ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో భవనాల నిర్మాణం పూర్తైంది.ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నియోజకవర్గం గజ్వేల్‌ లో కూడా ఎమ్మెల్యే కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.సి.ఎంకు సంబంధించిన నియోజకవర్గం కావడంతో నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.ముఖ్యమంత్రి కోసం ఈ భవనంలో సకల సౌకర్యాలు కల్పించారు. ఫైవ్ స్టార్ స్థాయిలో ఈ భవనంలో ఏర్పాట్లున్నాయి.ఇందు కోసం ఐదు కోట్ల వరకు ఖర్చు చేశారు.ఇటీవలె ఈ కార్యాలయాన్ని మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. గజ్వేల్ లో ఈ కార్యాలయాన్ని నిర్మించి నెలలు గడుస్తున్నప్పటికి ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు అడుగు పెట్టలేదు.

 పార్టీ కార్యాల‌యానికి కూడా రీ-డిజైన్..! అదే గులాబీ విజ‌న్..!!

పార్టీ కార్యాల‌యానికి కూడా రీ-డిజైన్..! అదే గులాబీ విజ‌న్..!!

ఇటీవల హరిత హారం కార్యక్రమం కోసం నియోజకవర్గానికి వెళ్లినప్పటికి ఆయన తన నివాసం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో అందరికి అనుమానాలు మొదలయ్యాయి. అయితే గజ్వేల్ కార్యాలయం లో వాస్తు దోషం ఉన్నందు వల్లనే చంద్రశేఖర్ రావు అక్కడికి వెళ్లడం లేదన్నది తాజా సమాచారం. కొన్ని మరమ్మత్తులు జరిగిన తర్వాతే మాత్రమే వెళ్లాలని వాస్తు పండితులు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఏ స్థాయిలో ఈ భవనానికి మరమ్మత్తులు చేస్తారో, దానికెంత ఖర్చు చేస్తారో చూడాల్సిందే. మొత్తానికి వాస్తు పేరుతో రాష్ట్ర సెక్రటేరియట్ లోని తన కార్యాలయానికి మూతేసిన చంద్రశేఖర్ రావు ఇప్పుడు మరో భవనానికి కూడా ఆ మరక అంటించారన్న మాట.

English summary
telangana cm kcr is not interested to enter into party office which is newly constructed in gajwel constituency. the office building constructed with all amenities. cm kcr feeling that the building construction is against vastu. thats why he does not like operate political programmes from that office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X