గవర్నమెంట్ జాబ్‌పై కెసిఆర్ వార్నింగ్, నీళ్లు అడిగితే చంద్రబాబు గొడవ
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగమే వస్తుందని ఎవరు కూడా జీవితాలు పాడు చేసుకోవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ శాసన సభలో అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదని, అలా ఇవ్వడం అసాధ్యమన్నారు.
ఆర్థిక రంగ ప్రముఖులను సంప్రదించాకే బడ్జెట్ తయారు చేశామని చెప్పారు. ప్రతిపక్షాల నుంచి గొప్ప సూచనలు వస్తాయనుకున్నామని, కానీ ఒక్కటీ రాలేదని చెప్పారు. తాను విహారయాత్ర కోసం చైనా వెళ్లలేదని, పెట్టుబడుల కోసం వెళ్లానని చెప్పారు.
కమలనాథన్ కమిటీ గడువులోగా ఉద్యోగుల పంపకాలు పూర్తి చేయలేదన్నారు. ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం సాధ్యం కాదని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అంటే కోటికి పైగా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అది సాధ్యం కాని పని అన్నారు.

లక్ష ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ చేస్తామని చెప్పారు. అయితే, ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే కొత్త ఉద్యోగాలు ఇవ్వగలమన్నారు. అవకాశమున్నంత వరకు ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. సభలో ఏ ఒక్క అంశం పైనా చర్చ సరిగా జరగలేదన్నారు. బంగారు తెలంగాణ కావాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలన్నారు.
మనం 16 శాతం అప్పుల్లోనే ఉన్నామని, మిగతా రాష్ట్రాల కంటే నయమని చెప్పారు. ఉద్యమంలో చెప్పినట్లు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కోటి ఎకరాలకు నీరు ఇస్తే తెలంగాణ ఆకుపచ్చ రాష్ట్రం అవుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగమే వస్తుందని యువత జీవితాలు పాడు చేసుకోవద్దని హితవు పలికారు.
ఇంటికో ఉద్యోగం కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదన్నారు. వచ్చే అయిదేళ్లలో ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పారు. బడ్జెట్‌లో పెట్టిన మొత్తం ఎప్పుడు కూడా ఖర్చు కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు పారిస్తామన్నారు.
అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగిన తర్వాత సభ్యులకు ధన్యావాదాలు తెలుపుతూ సీఎం కెసిఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. మిషన్ భగీరథ ఎక్సెలెంట్ పథకమి సీఎం అభివర్ణించారు. మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ప్రతీ నగరం, పట్టణం, గ్రామం మంచినీటిని అందిస్తామన్నారు. మిషన్ భగీరథ కోసం ఎంతైనా చేస్తామన్నారు.
నీళ్లు అడిగితే చంద్రబాబు గొడవ పెడుతున్నాడు
పక్క రాష్ట్రాలతో తాము బస్తీమే సవాల్ అనే ధోరణిలో వెళ్లలేమని చెప్పారు. సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పారు. చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టును కట్టుకున్నాడని, శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు అడిగితే పంచాయతీ పెడుతున్నాడని కెసిఆర్ వ్యాఖ్యానించారు.
ఇలాంటి అంశాల పైన అసెంబ్లీలో చర్చిద్దామని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు అడిగే ప్రతి సమస్యకు తాము సమాధానం చెబుతామన్నారు. ప్రతిపక్షాలు పర్తి అవగానహతో ఏ అంశంపై లేవనెత్తినా సమాధానం చెబుతామన్నారు. అర్ధరాత్రి వరకైనా చర్చించేందుకు సిద్ధమని చెప్పారు. అవినీతి పైన విచారణ జరిపిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications