అనంతపురం జిల్లా పర్యటనకు కెసిఆర్, ఎందుకంటే?
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాహానికి హజరయ్యేందుకు కెసిఆర్ అక్టోబర్ 1వ, తేదిన అనంతపురం.
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతపురం పర్యటనకు వెళ్ళనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాహానికి హజరయ్యేందుకు కెసిఆర్ అక్టోబర్ 1వ, తేదిన అనంతపురం వెళ్ళనున్నారని సిఎంఓ వర్గాలు ప్రకటించాయి.
పరిటాల శ్రీరామ్ వివాహం అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరగనుంది. ఈ వివాహానికి కేసీఆర్ హాజరు కానున్నారు. కేసీఆర్ పర్యటన ఖరారైనట్టు సీఎం క్యాంపు కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి.

ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి పుట్టపర్తికి విమానంలో కెసిఆర్ చేరుకొంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెంకటాపురం వెళతారు. శ్రీరామ్ దంపతులను ఆశీర్వదిస్తారని సిఎంఓ వర్గాలు చెప్పాయి.
ఇక ఇదే వివాహానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. దీంతో వెంకటాపురం గ్రామాన్ని ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకోగా, పెళ్లికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. వివాహం సమయంలో కేసీఆర్, చంద్రబాబు మరోసారి కలవనున్నారని తెలుస్తోంది. అయితే, వీరిద్దరి మధ్య ఎటువంటి అధికారిక చర్చలు ఉండవని సమాచారం.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications