హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిది రోజులుగా తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.'పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

telangana cm kcr wishes on the festival of saddula bathukamma in the state

తెలంగాణలో బతుకమ్మ,దసరా పండుగలను అత్యంత పెద్ద ఎత్తున నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.ప్రకృతి పూలను ఆరాధించే అరుదైన,విశిష్ఠమైన పండుగ బతుకమ్మ.ఎంగిలిపూల బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ,వెన్న ముద్దల బతుకమ్మ,సద్దుల బతుకమ్మ.. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి.

చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు సాయంత్రం బతుకమ్మని పేర్చి ఆటపాటలతో వేడుక జరుపుకుంటారు. అనంతరం బతుకమ్మని తలపై పెట్టుకుని ఊరేగింపుగా చెరువు వద్దకు వెళ్తారు. అక్కడ బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. ఆ తర్వాత సత్తు ముద్దల ప్రసాదాన్ని బంధుమిత్రులకు పంచిపెడుతారు.

సాధారణంగా రాష్ట్రమంతా ఒకేరోజు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతాయి.కానీ ఈసారి భిన్నమైన పరిస్థితి నెలకొంది. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష్య పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో కొన్నిచోట్ల బుధవారం,మరికొన్నిచోట్ల గురువారం ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. దుర్గాష్టమి నాడే సద్దుల బతుకమ్మగా పండితులు నిర్ణయించగా, కొండపాక, వేములవాడల్లో ఏడు రోజులు నిర్వహిస్తారని, కొన్ని ప్రాంతాల్లో 9, మరికొన్ని ప్రాంతాల్లో 11, 13 రోజులు ఆడతారని తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర సిద్ధాంతి పేర్కొన్నారు.అయితే తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని కొనసాగించాలనుకునేవారు గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు.

English summary
Telangana Chief Minister KCR wished on the festival of saddula bathukamma celebrations in the state. The CM expressed happiness over the celebration of the state festival Batukamma
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X