SRH Vs CSK: ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్, చిరు, వెంకటేశ్

హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ తిలకించేందుకు ఉప్పల్ స్టేడియంకు కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను సీఎం రేవంత్ తన కుటుంబసభ్యులతో కలిసి వీక్షిస్తున్నారు.

రేవంత్ రెడ్డిని చూసిన పలువురు క్రికెట్ అభిమానులు సీఎం.. సీఎం అంటూ కేరంతలు కొట్టారు. మరోవైపు, పలువురు సినీ ప్రముఖులు కూడా స్టేడియంలో సందడి చేశారు. ప్రముఖ సినీ నటులు చిరంజీవి, వెంకటేశ్, బ్రహ్మానందం, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, తదితరులు ఈ మ్యాచ్ తిలకించారు. ఇక, మ్యాచ్ రిపోర్టు విషయానికొస్తే.. నాలుగు వికెట్లు కోల్పోయిన చెన్నై జట్టు 19 ఓవర్లలో 158 పరుగులు చేసింది.

Telangana CM Revanth reddy and venkatesh chiranjeevi attended uppal stadium to watch SRH VS CSK match

ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత

అభిమాన జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా క్రికెట్ ప్రేమికులు చేరుకున్నారు. ఐపీఎల్-17 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య శుక్రవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్ తిలకించేందుకు క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా స్టేడియానికి వచ్చారు.

క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనికి ఇదే చివరి ఐపీఎల్‌ అనే ఉద్దేశంతో అభిమానులు స్టేడియానికి బారులు తీరారు. ఈ క్రమంలో స్టేడియానికి చేరుకున్న క్రికెట్‌ అభిమానులు టికెట్లు ఉన్న లోపలికి అనుమతించడం లేదని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉప్పల్‌ స్టేడియంలోని గేట్‌ నంబరు 4 వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గేట్‌ దగ్గర ఉన్న బారికేడ్లను తోసేసిన అభిమానులు ఒక్కసారిగా గేట్లు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇక్కడ పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు సిబ్బంది ఒక్కొక్కరిని గేటు ద్వారా లోపలికి పంపించారు. కాగా, ఉప్పల్‌ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది.

ఈ మ్యాచ్‌ కోసం పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లను చేశారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం రాత్రి అదనంగా గంటపాటు మెట్రో రైళ్లు ఈ మార్గంలో నడవనున్నాయి. మరోవైపు, టీఎస్‌ఆర్టీసీ కూడా మ్యాచ్‌ కోసం ప్రత్యేకంగా బస్సులను నడపనుంది. హైదరాబాద్ అభిమానులతోపాటు ధోనీ అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి చేరుకున్నారు. ఎక్కువ సంఖ్యలో అభిమానులు చెన్నై జెర్సీలను ధరించి సందడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+