రేవంత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం: 2వ తేదీకి ఓటుకు నోటు కేసు వాయిదా

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు అంటే గౌరవం లేదా? అంటూ నిలదీసింది. హెచ్చరికలను జారీ చేసింది. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుపై తెలంగాణ ముఖ్యమంత్రికి గౌరవం లేకపోతే ఎలా? అని ప్రశ్నించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన 2015 నాటి ఓటుకు నోటు కేసును తెలంగాణ నుంచి వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Telangana CM Revanth Reddy does not have respect for the Supreme Court

ఈ పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ బీఆర్ గవై, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటీషనర్ల తరఫున సీనియర్ అడ్వొకేట్ సుందరం, ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ, మేనకా గురుస్వామి తమ వాదనలను వినిపించారు.

వాదనల సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిపై అసహనాన్ని వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టుపై రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లు సుప్రీంకోర్టుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపింది.

ఎవరు విమర్శించినా పట్టించుకోకుండా తమ మనస్సాక్షి ప్రకారం విధులను నిర్వహిస్తామని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. చట్టసభల పరిధిలో ఉన్న అంశంలో తాము జోక్యం చేసుకోబోమనే విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటామని అన్నారు. అనంతరం ఈ కేసుపై విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+