Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ గాంధీని అడ్డుకుంటారా?: బీజేపీపై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్: అస్సాంలో భారత్ జోడో యాత్ర చేస్తోన్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని అడ్డుకోవడాన్ని తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాహుల్ యాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం, గుడి సందర్శనకు అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ధోరణి సరికాదన్నారు. బీజేపీ స్పాన్సర్డ్ దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు.

రాహుల్ భద్రత విషయంలో కూడా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని రేవంత్ ఆరోపించారు. ఇలాంటి చర్యలతో రాహుల్ గాంధీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలు ఫలించవన్నారు. మరింత మనోధైర్యంతో ఆయన ముందుకు సాగుతారన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు అండగా ఉన్నారన్నారు. ఈ దేశ ప్రజల మద్దతు ఆయనకుందన్నారు.

telangana cm revanth reddy responded on attack on rahul gandhis vehicle in assam

తెలంగాణ సమాజం కూడా రాహుల్ గాంధీకి అండగా ఉంటుందని రేవంత్ చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు అండగా, పేదలకు న్యాయం జరగాలన్న లక్ష్యంతో రాహుల్ తలపెట్టిన ఈ యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు రేవంత్.

కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ

అస్సాంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను అడ్డుకున్నందుకు నిరసనగా కాంగ్రెస్ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావ్ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీప్ దాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబు, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, మధు యాష్కీ, ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుక పలువురు నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. హిమంత్ బిశ్వ శర్మ మా దగ్గర ఉన్నప్పుడు బాగా ఉండే వాడు కానీ అక్కడికి వెళ్లి దారుణంగా తయారు అయ్యాడు. అస్సాం ప్రజలు హిమంత బిశ్వ శర్మను చీ కొడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అస్సాం ప్రభుత్వం రాహుల్ గాంధీకి భద్రత కల్పించడంలో విఫలం అయ్యిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అస్సాం ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక బీజేపీ వాళ్ళు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ వాళ్ళ లాగా మాకు కూడా దేశ వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు.. కానీ, మేము ఎప్పుడు దాడులు చేశామా..? అని ప్రశ్నించారు. అస్సాంలో బీజేపీ కార్యకర్తలు గుండాల లాగా ప్రవర్తించారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు.

కాగా, రామ మందిర ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న వేళ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ గాంధీ తనపై దాడి జరిగిందంటూ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాహుల్ గాంధీపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. హిందువులమని చెప్పుకునే కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇన్నేళ్లు రామ మందిర నిర్మాణాన్ని ఎందుకు వ్యతిరేకించారని ప్రశ్నించారు. రాముడు అందరి వాడని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+