రేవంత్ ఆర్దిక కష్టాలు గట్టెక్కేదెలా - రంగంలోకి మాస్టర్ బ్రెయిన్..!!
సీఎం రేవంత్ పాలనలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీ పథకాల అమలు ఇప్పుడు రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి. వంద రోజుల్లో హామీలు అమలు చేయాల్సి ఉంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ హైకమాండ్ రేవంత్ మెజార్టీ సీట్లు గెలిపిస్తారనే నమ్మకంతో ఉంది. ఆర్దిక కష్టాలు రేవంత్ ను వెంటాడుతున్నాయి. ఈ సమయంలోనే రేవంత్ తాజా సమావేశం కీలకంగా మారుతోంది.
రేవంత్ ముందు ఆర్దిక సవాళ్లు : తెలంగాణలో ప్రభుత్వం కొలువు తీరి పది రోజులైంది. పార్టీ ఇచ్చిన హామీల అమలుకు మరో 90 రోజుల సమయం ఉంది. ఇటు హామీలు అమలు చేయాలంటే ఆర్దికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. కానీ, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. దీంతో..ఆర్దిక నిర్వహణ పైన రేవంత్ ఫోకస్ చేసారు. నిపుణులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తో సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మాజీ ముఖ్య సలహాదారుగా కూడా పనిచేసిన రఘురామరాజన్.. సీఎం రేవంత్ రెడ్డితో తన అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఆర్థికపరిస్థితిని మెరుగుపరిచేందుకు పలు సూచనలు చేశారు.

రఘురామ రాజన్ తో భేటీ : ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తో సహా కీలక అధికారులు సీఎస్ శాంతి కుమారి, స్పెషల్ ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణా రావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఆర్దిక పరిస్థితులు..తమ ముందున్న సవాళ్లను వివరించినట్లు తెలుస్తోంది. ఆర్దిక రంగంలో నిష్ణాతులు అయిన రఘురామరాజన్ నుంచి ప్రజల పై భారం పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ముందుగా ఆదాయ పెంపు మార్గాల పైన సూచనలు చేసినట్లు సమాచారం. కాగా, ప్రభుత్వాలు దివాలా తేసే స్థాయిలో ఉచితాలు ఇవ్వొద్దని, ఉంటే నిరుపేదలకు ఉపయోగపడే ఉచితాలు సమర్థనీయమేనని రెండు రోజుల క్రితం రాఘురామ్ రాజ్ అన్నారు.

సలహాలు - సూచనలు : కానీ, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హామీలు అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈ భేటీ జరిగింది. ప్రభుత్వానికి సలహారుని పాత్రలో రఘురామ రాజన్ ఎప్పుడు అవసరమైన అందుబాటులో ఉంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరించిన రఘురామ రాజన్ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపైన తన అభిప్రాయాలను స్పష్టం చేస్తూ వచ్చారు. ఇక..ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు అమలు ప్రారంభమయ్యాయి. దీంతో..రఘురామ రాజన్ సలహాలు రేవంత్ ప్రభుత్వానికి కీలకం కానున్నాయి.












Click it and Unblock the Notifications