మళ్లీ రగడ, అనుమతి లేకుండా గేట్లు ఎత్తివేత: బాబుకు షాక్, తెలంగాణ ఫిర్యాదు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య మరోసారి గొడవ రాజుకుంది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

బాబుకు తమిళనాడు ఝలక్: ఎక్కడిదాకైనా రెడీ.. ఇక జగన్ పక్కా ప్లాన్

ఏపీ ఏకపక్షంగా గేట్లు ఎత్తిందని ఫిర్యాదు

ఏపీ ఏకపక్షంగా గేట్లు ఎత్తిందని ఫిర్యాదు

ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ మంగళవారం నాడు లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు గేట్లను ఏపీ ఏకపక్షంగా తెరిచిందని మురళీధర్ ఈ లేఖలో పేర్కొన్నారు.

వెంటనే సమావేశం ఏర్పాటు చేయండి

వెంటనే సమావేశం ఏర్పాటు చేయండి

వెంటనే కృష్ణా బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇరు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి పంపిణీపై కార్యాచరణ ప్రణాళికపై చర్చించాలని ఈ లేఖలో మురళీధర్ విజ్ఞప్తి చేశారు.

మూడు గేట్లు ఎత్తిందని ఆరోపణ

మూడు గేట్లు ఎత్తిందని ఆరోపణ

కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఆంధ్రప్రదేశ్ 3 గేట్లు ఎత్తిందని తెలంగాణ ఆరోపించింది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలపై తక్షణం బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని పేర్కొంది.ఏపీ 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిందని ఆరోపించారు.

పోతిరెడ్డిపాడు నీటి కోసం మొన్న తరలిన రైతులు

పోతిరెడ్డిపాడు నీటి కోసం మొన్న తరలిన రైతులు

కాగా, రెండు రోజుల క్రితం పోతిరెడ్డిపాడు వద్దకు ఎస్పీవై రెడ్డి నేతృత్వంలో రైతులు భారీగా వచ్చారు. గేట్లు ఎత్తేందుకు పూజలు చేసి ప్రయత్నాలు చేశారు. అయితే గేట్లు ఎత్తేందుకు అధికారులు నిరాకరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Government complaint against Andhra Pradesh government on pothireddypadu water issue to Krishna water board.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X