హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఆందోళన.. ఉద్రిక్తత: భారీ ర్యాలీ

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత్రి సోనియా గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి కారులో ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె వెంట కుమారుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, కుమార్తె, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆమె ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఢిల్లీ పోలీస్ రోప్ పార్టీ ప్రత్యేకంగా మోహరించారు. ఆమె ప్రయాణిస్తోన్న మార్గంలో ఎవ్వరినీ అనుమతించలేదు.

దీని తరువాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. నిరసన ప్రదర్శనలకు దిగారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో నిరసనల తీవ్రత అధికంగా కనిపించింది. కర్ణాటకలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత డీకే శివకుమార్ సారథ్యంలో పార్టీ నాయకులు బెంగళూరులో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులతో ఢిల్లీ పోటెత్తింది. నినాదాలతో హోరెత్తిపోయింది.

Telangana congress hold a protest in Hyderabad against ED questioning to Sonia Gandhi

హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. నల్లజెండాలను ఎగురవేశారు. అవేరంగు బ్యానర్లను ప్రదర్శించారు. ఈడీ ఫర్ మోడీ అంటూ నినదించారు. బీజేపీ హఠావో-దేశ్ బచావో అంటూ నినాదాలు చేశారు. నెక్లెస్ రోడ్ వద్ద గల ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నల్లజెండాలు, నల్ల బ్యానర్లను ప్రదర్శించారు. ర్యాలీగా బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఈడీ కార్యాలయం ముందు బైఠాయించారు.

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు రాష్ట్రస్థాయి నాయకులు ఇందులో పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థను అడ్డుగా పెట్టుకుని మోడీ ప్రభుత్వం రాజకీయ సాగిస్తోందని విమర్శించారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క బీజేపీ నాయకుడిపైన అయినా సీబీఐ గానీ, ఈడీ గానీ, ఐటీ ఆధికారులు గానీ దాడులు చేశారా? అని ప్రశ్నించారు. ప్రజల ఆదరణను చూరగొన్న నాయకులపై మోడీ సర్కార్ సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తోందని, దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+