టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్న మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్..?

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

డి. శ్రీనివాస్ టీఆర్ఎస్‌లో చేరేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు ఓ తెలుగు పత్రికలో వార్తా కథనం రావడం ఉత్కంఠను రేపుతోంది. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి వెన్నుముకలా నిలిచిన డీ. శ్రీనివాస్ పార్టీ మారితే తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టవుతుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడతున్నారు.

ఇటీవలే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు డి.శ్రీనివాస్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే దిగ్విజయ్ సింగ్‌ను కలిసేందుకు గానీ, మాట్లడేందుకు గానీ డీఎస్ ఆసక్తి చూపలేదు.

Telangana Congress leader D Srinivas may join in trs

అంతేకాదు కాంగ్రెస్ హైకమాండ్ తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నా, దిగ్విజయ్ సింగ్ కావాలనే ఆ పదవి రాకుండా అడ్డుపడ్డారని తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు ఇటీవలే మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో సొంత పార్టీలో అవమానాలు పడటం కంటే, పార్టీ మారడమే మంచిదని ఆలోచలనో డీఎస్ ఉన్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే డి.శ్రీనివాస్ రాకను టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+