హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దివాళా కంపెనీలతో ఒప్పందాలు, మాట వినలేదని ఐఎఎస్‌లను తప్పించారు: కెసిఆర్‌పై రేవంత్ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలన్నీ గోల్‌మాల్ ఒప్పందాలేనని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం ముందుచూపు నిర్ణయాలతోనే దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ సాధ్యమైందని ఆయన చెప్పారు. తక్కువ ధరకే ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఇస్తానని ప్రకటిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.

మంగళవారం నాడు రేవంత్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న విషయాల్లో వాస్తవాలు లేవని రేవంత్ ఆరోపణలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్ళపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ విషయంలో టిఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్ చెప్పారు.

దివాళా తీసీన కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు

దివాళా తీసీన కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు

విద్యుత్‌ ఒప్పందాల ముసుగులో టీఆర్ఎస్‌ సర్కారు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దివాళా తీసిన కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం అక్రమాలకు తెర తీసిందని విమర్శించారు. కేసీఆర్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల్లో అత్యంత అవినీతి దాగుందన్నారు. విద్యుత్‌ ఒప్పందాలు, కొనుగోళ్లపై శ్వేతపత్ర విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇతర పార్టీల సీనియర్లంతా మాతో టచ్‌‌లో, సంక్రాంతి తర్వాత కొత్త పీసీసీ కమిటీ: ఉత్తమ్ ఇతర పార్టీల సీనియర్లంతా మాతో టచ్‌‌లో, సంక్రాంతి తర్వాత కొత్త పీసీసీ కమిటీ: ఉత్తమ్

ఐఎఎస్‌లను తప్పించిన సన్నిహితులను

ఐఎఎస్‌లను తప్పించిన సన్నిహితులను

డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఐఎఎస్ అధికారులను కాకుండా తన సన్నిహితులను కెసిఆర్ నియమించుకొన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాపై ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అబద్దాలు చెబుతున్నారని రేవంత్ ఆరోపించారు.తన మాట విననందుకే ఐఎఎస్‌లను కెసిఆర్ విద్యుత్ శాఖ నుండి తప్పించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

నేను వైఎస్ అభిమానిని, ఆత్మగౌరవయాత్ర చేస్తా: మల్లు భట్టి విక్రమార్క నేను వైఎస్ అభిమానిని, ఆత్మగౌరవయాత్ర చేస్తా: మల్లు భట్టి విక్రమార్క

విద్యుత్ కొనుగోళ్ళలో అవతవకలపై చర్చకు సిద్దం

విద్యుత్ కొనుగోళ్ళలో అవతవకలపై చర్చకు సిద్దం

విద్యుత్ కొనుగోళ్ళలలో అవకతవకలపై ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి ప్రభాకర్ రావుతో చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గోల్ మాల్ ఒప్పందాతో ఒకే సంస్థకు ప్రభుత్వం రూ.957 కోట్లను చెల్లించింది వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్ మాట విననందుకే ఐఏఎస్‌లు సురేష్ చంద్ర, అరవింద్ కుమార్‌లను తప్పించారని రేవంత్ చెప్పారు.

తక్కువ ధరకు ఏపీ నుండి విద్యుత్ ను ఎందుకు తీసుకోవడం లేదు

తక్కువ ధరకు ఏపీ నుండి విద్యుత్ ను ఎందుకు తీసుకోవడం లేదు

ఏపీ రాష్ట్రం నుండి అదనపు విద్యుత్ ను తక్కువ ధరకే చెల్లించేందుకు సిద్దంగా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించడం వల్లే మిగులు విద్యుత్ సాద్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. వ్యవసాయశాస్త్రవేత్త స్వామినాథన్ కెసిఆర్ ను ప్రశంసించారంటే తాను నమ్మడం లేదన్నారు. నకిలీ అవార్డులు తీసుకొన్న చరిత్ర కెసిఆర్ ప్రభుత్వానికి ఉందన్నారు రేవంత్ రెడ్డి.

English summary
Telangana congress leader Revanth Reddy demanded government release white paper on electricity. He spoke to media on Tuesday at Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X