తెలంగాణలో అధికార మదంతో నేతలపై టిఆర్ఎస్ దాడులు! (పిక్చర్స్)
హైదరాబాద్/మహబూబ్ నగర్: పాలమూరు జిల్లా మక్తల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పైన శుక్రవారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దాడి చేశారంటూ కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్రస్థాయిలో నిరసన తెలిపింది.
టిఆర్ఎస్‌ది అధికార మదం అని కాంగ్రెస్ నేతలు డికె అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, జానా రెడ్డిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. తాము తలచుకుంటే టిఆర్ఎస్ నేతలు గ్రామాల్లో తిరగలేరని హెచ్చరించారు.

కాంగ్రెస్
ప్రభుత్వంపై ఎదురు దాడి చేద్దామని, మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

కాంగ్రెస్
గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించగా, కొంతమంది నేతలు ఆయన సరిగా స్పందించడంలేదని వాపోయారు.

కాంగ్రెస్
చివరికి గవర్నర్ వద్దకు వెళ్లాలని, ఆ తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించారు. సోమవారం జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద పార్టీ ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు.

కాంగ్రెస్
టిఆర్ఎస్ పైన పోరుకు టిడిపిని కలుపుకొని వెళ్లాలని డీకే అరుణ సూచించగా పొంగులేటి సుధాకర్ రెడ్డి వ్యతిరేకించారు.

కాంగ్రెస్
టిడిపినే కాంగ్రెస్‌కు మొదటి శత్రువని, ఆ పార్టీతో సఖ్యత సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ ఉద్యమాలు నిర్వహిస్తేనే కేసీఆర్‌కు కాంగ్రెస్ అంటే భయం పుడుతుందని వీ హనుమంత రావు సూచించారు.

కాంగ్రెస్
తమ పార్టీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై దాడి చేసిన తెరాస శాసనసభ్యుడు గువ్వల బాలరాజుపై చర్య తీసుకోవాలని కోరుతూ ఉత్తమ్, జానారెడ్డి, భట్టి, షబ్బీర్ అలీ తదితర నేతలతో పాటు కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి తదితరులు శనివారం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్
ఈ సందర్భంగా జైపాల్‌రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి, తగినవిధంగా స్పందించాలని సూచించారు.

కాంగ్రెస్
టిఆర్ఎస్ ఇంకా ఉద్యమ పార్టీలానే వ్యవహరిస్తోందని షబ్బీర్‌అలీ అన్నారు. ప్రభుత్వాన్ని సంజాయిషీ కోరాలని ఉత్తమ్, జానారెడ్డిలు కోరారు.

కాంగ్రెస్
కాంగ్రెస్ నేతలు సీఎం ఇంటి వద్ద నిరసనలు తెలిపేందుకు వెళ్లారు. పోలీసులు సోమాజిగూడ సర్కిల్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, వీహెచ్, జీవన్ రెడ్డి, డీకే అరుణ, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

కాంగ్రెస్
పోలీసులు వారిని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు తెరాస ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్
ఎమ్మెల్యేలను దాడులతో భయపెట్టాలని టిఆర్ఎస్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీ పప్పులుడకవని, తమ తడాఖా చూపిస్తామని, ప్రజల సహకారంతో టిఆర్ఎస్‌ను అడ్డుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్
టిఆర్ఎస్ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని, విపక్ష నేతలు సీఎంను కలవకుండా పోలీసులు అడ్డుకోవడం అమానుషమని, అనైతికం, దుందుడుకు చర్యలు, ప్రజావ్యతిరేక విధానాలను సహించేది లేదని జానా రెడ్డి అన్నారు.

కాంగ్రెస్
చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై దాడికి నిరసనగా శనివారం పాలమూరు జిల్లా కాంగ్రెస్ చేపట్టిన బందు పాక్షికంగా జరిగింది. నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బస్ డిపోల ఎదుట ధర్నాలు చేశారు.

కాంగ్రెస్
గద్వాలలో ఎమ్మెల్యే డీకే అరుణ, కల్వకుర్తిలో ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

కాంగ్రెస్
గద్వాల, కొల్లాపూర్ పట్టణాల్లో టిఆర్ఎస్ నాయకులు సైతం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగులబెట్టి కాంగ్రెస్ దౌర్జన్యాలను నశించాలంటూ నిరసన తెలిపారు.

కాంగ్రెస్
గద్వాల, వనపర్తి పట్టణాల్లో దుకాణాలు మూతపడ్డాయి. ఆత్మకూర్ పట్టణంలో గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. గద్వాల, కొల్లాపూర్ మినహా మిగతా ఏడు డిపోల్లో ఉదయం పదింటి తర్వాత బస్సులు నడిచాయి.
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో.. దొరల పాలనలో విపక్ష నేతల పైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సీఎల్పీ అత్యవసర సమావేశం జరిగింది. సీనియర్లు భేటీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్మోహన్‌రెడ్డి సంఘటన జరిగిన తీరును వివరించారు. విపక్షాన్ని తెరాస ప్రభుత్వం అవమానపరుస్తోందని, గతంలో ఎమ్మెల్యే చిన్నారెడ్డిపై దాడి జరిగినప్పుడే తగిన విధంగా స్పందిస్తే మళ్లీ ఇలాంటివి జరిగేవి కాదని వారు అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications