హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ముందస్తు ఎన్నికల వ్యూహం; అందుకే ఉద్యోగాల ప్రకటన ..! జిమ్మిక్కులు పనిచేయవ్..!! : కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు. మొత్తం 91,142 ఖాళీలకు గాను 80,039 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవాళే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అటు గరిష్ట వయోపరిమితిని కూడా పెంచుతున్నట్లు సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకు దగ్గుతాయని, ఐదు శాతం మాత్రమే స్థానికేతరులకు వస్తాయని సీఎం వివరించారు.

 ముందస్తు ఎన్నికలు అందుకే .. ఉద్యోగాల ప్రకటన

ముందస్తు ఎన్నికలు అందుకే .. ఉద్యోగాల ప్రకటన

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన.. కేవలం రాజకీయ లబ్ధికోసమే అని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే ఇప్పుడు ఉద్యోగాల ప్రకటన చేశారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాక ఇప్పటివరకు ఎందుకు ఉద్యోగాలను భర్తీ చేయలేదని ప్రశ్నించారు. అప్పులు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకున్నారు . కానీ, ఉద్యోగాలు లేక ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇన్నాళ్లు మాయ మాటలతో మోసం

ఇన్నాళ్లు మాయ మాటలతో మోసం

తన మాయ మాటలతో కేసీఆర్ ఇన్నాళ్లు నిరుద్యోగులను మోసం చేసి పబ్బంగడుపుకున్నారని వీహెచ్ విమర్శించారు. నిరుద్యోగులు, ప్రజల నుంచి వస్తున్న వ్యతరేకతతోనే ఈరోజు ముఖ్యమంత్రి ఉద్యోగాల ప్రకటన చేశారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. దీనిని స్వాగతిస్తున్నాము. కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగాల కోసం చనిపోయిన నిరుద్యోగుల కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. నిరుద్యోగ భృతి క్రింద రూ.3000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 శాఖలు కుదించి ఉద్యోగ నియామకాలు

శాఖలు కుదించి ఉద్యోగ నియామకాలు

ఉద్యోగాల భర్తీతో పాటు వయోపరిమితిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతోందన్నారు వీహెచ్. అందుకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 సంవత్సరాలకు పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఉన్న ఖాళీలు ఉద్యోగ విరమణ ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారని మండిపడ్డారు. శాఖలను కుదించి ఉద్యోగ నియామకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 జిల్లాలు అదనంగా ఏర్పాటు చేశారు. అందుకు అనుగుణంగా ఉద్యోగాలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఉద్యోగాల భర్తీ అని విమర్శించారు. కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఎద్దేవా చేశారు. అందరి త్యాగాల ఫలితమే తెలంగాణ అని గుర్తు చేశారు. పంజాగుట్టలో డాక్లర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

English summary
Congress leader VH Cournter on CM KCR job notifications announcement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X