రంజీ టీం తయారౌతోంది : బిసిసిఐ గుర్తింపు కోసం టి క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నం
హైదరాబాద్: తెలంగాణ రంజీ ట్రోఫీ జట్టును తయారు చేస్తున్నామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. తాము బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పింది.
క్రీడాకారులకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టిసిఏ) శుక్రవారం నాడు తదెలిపింది. క్రికెట్ మైదానాలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపింది. తమకు ప్రభుత్వం సహకారం ఉంటుందని టిసిఏ ఆశాభావం వ్యక్తం చేసింది.
తెలంగాణ క్రికెట్ టోర్నీల క్యాలెండర్ విడుదల
తెలంగాణ క్రికెట్ సంఘం టోర్నీల క్యాలెండర్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు బీబీ పాటిల్, విశ్వేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. జిల్లాల్లో సెప్టెంబర్ 20 నుంచి సీనియర్ గ్రూప్ నాకౌట్ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 7 నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ జరగనుంది. నవంబర్‌లో అంతర్ పాఠశాలల టోర్నీ నిర్వహించనున్నారు. తెలంగాణ యువకుల్లో క్రికెట్ ప్రతిభను వెలికితీయడానికి టోర్నీలు దోహదపడుతాయన్నారు.
మూడేళ్లలో రైతులకు 24 గంటల విద్యుత్

వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో మంత్రులు ఈటెల రాజేందర్, జోగు రామన్నలు శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. వచ్చే ఆరు నెలల్లో రైతులకు పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు.
మూడేళ్లలో రైతులకు 24 గంటల విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. తాగునీటి కోసం రూ.35 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు.
నేషనల్ గాడ్జెట్ ఎక్స్‌పోను ప్రారంభించిన కేటీఆర్
మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండియన్ నేషనల్ గాడ్జెట్ ఎక్స్‌పోను తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయంగా భారతదేశ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ గాడ్జెట్ ఎక్స్‌పోను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications