అసెంబ్లీ రద్దుపై చకచకా: గవర్నర్‌తో సీఎస్, అధికారుల భేటీ, ఫాంహౌస్ రావాలని కేసీఆర్

హైదరాబాద్: గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ సీఎస్ ఎస్కే జోషి మంగళవారం కలిశారు. జోషితో పాటు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింహ రావులు కూడా ఉన్నారు. అంతకుముందు, సచివాలయంలో కీలక సమావేశం జరిగింది.

ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌తో సీఎస్ భేటీ అయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు ప్రకటన చేస్తారని, త్వరలో మరోసారి కేబినెట్ భేటీ జరుగుతుందనే నేపథ్యంలో గవర్నర్‌తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

కేసీఆర్ ముందస్తు వ్యూహం

కేసీఆర్ ముందస్తు వ్యూహం

మరోవైపు, కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. తన ఫాం హౌస్ నుంచి వ్యూహ రచనలో బిజీగా ఉన్నారు. ఆయన సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్ చేరుకున్నారు. కేబినెట్ సమావేశం, అసెంబ్లీ రద్దులపై పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. ఈ నెల 6న కేబినెట్ భేటీ అవకాశముంది. 7వ తేదీన హుస్నాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీనిపై మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావులకు ఆదేశాలు వెళ్లాయని తెలుస్తోంది.

Recommended Video

    అసెంబ్లీ రద్దు పై కే సి ఆర్ కార్యాచరణ ఏమిటి ??
    రెండుసార్లు.. కాదు కాదు, ఒకేసారి కేబినెట్ భేటీ

    రెండుసార్లు.. కాదు కాదు, ఒకేసారి కేబినెట్ భేటీ

    కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఒకసారి, అశెంబ్లీ రద్దు చేసే తీర్మానం చేయడానికి మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం కానుందని అంటున్నారు. ఈ నెల 6న సమావేశమయ్యే అవకాశముంది. అయితే చివరగా ఒక కేబినెట్ భేటీలోనే అన్నింటిపై నిర్ణయాలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఆదివారం ప్రగతి నివేదన సభకు ముందు కేబినెట్ భేటీ అయింది. ఈ భేటీలోనే కేసీఆర్.. మరో రెండు మూడు రోజుల్లో భేటీ అవుదామని చెప్పారు.

     అసెంబ్లీ రద్దుకు సిఫార్స్ చేసే అవకాశం

    అసెంబ్లీ రద్దుకు సిఫార్స్ చేసే అవకాశం


    కేబినెట్లో చర్చించాల్సిన అంశాలపై మంగళవారం సాయంత్రంలోగా సమాచారం పంపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇప్పటికే అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశించారు. కొన్ని అంశాలపై కేబినెట్ ఆమోదం లేకుండా జీవో జారీ చేస్తే సరిపోతుందని అంటున్నారు. మొత్తంగా ఈ నెల 6న కేబినెట్ భేటీ కీలకం కానుందని, ఆ రోజు అసెంబ్లీ రద్దుకు సిఫార్స్ చేయవచ్చునని అంటున్నారు.

    సీఎస్ సహా అధికారులకు పిలుపు

    సీఎస్ సహా అధికారులకు పిలుపు

    అసెంబ్లీ రద్దు వెంటనే కేసీఆర్ ప్రచార బరిలోకి దిగుతారని అంటున్నారు. 50 నియోజకవర్గాల్లో 100 బహిరంగ సభలు నిర్వహించే అవకాశముంది. ఇందులో భాగంగా హుస్నాబాద్‌లో 7న సభ నిర్వహించనున్నారు. గజ్వెల్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న సీఎం కేసీఆర్.. తన వద్దకు రావాలని సీఎస్ జోషి, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు, రాజీవ్ శర్మకు చెప్పారు. కేబినెట్ సమావేశం, అసెంబ్లీ రద్దుపై చర్చించనున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+