వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్పీకర్‌ను ఆదేశించే అధికారం ఉందా?: ధర్మసనానికి సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణలోని ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌‌ను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

 Telangana defected MLAs issue: Supreme Court transfers the petition to Constitutional bench

ఈ సందర్భంగా పిటిషనర్‌ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసం లేదని వ్యాఖ్యానించింది.

అయితే, స్పీకర్‌ను ఆదేశించే అధికారం తమకు లేదని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్‌ను ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. కాగా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల కాలంలో పలువురు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

English summary
Supreme Court transfered the petition, which is belongs to Telangana defected MLAs issue, to Constitutional bench.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X