తెలంగాణ డిప్యూటీ సీఎంకు బీజేపీ చీఫ్ లీగల్ నోటీసులు
తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు లీగల్ నోటీసులు పంపించారు. రోహిత్ వేముల ఆత్మహత్యను కేసును ప్రస్తావిస్తూ భట్టి విక్రమార్క తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన న్యాయవాది విజయకాంత్‌తో నోటీసులు పంపించారు. మూడు రోజుల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బేషరతు క్షమాపణలు చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు. లేదంటే ఆయనపపై రూ.25 కోట్ల పరువు నష్టం వేస్తామని ఆయన హెచ్చరించారు. క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని రాంచందర్ రావు నోటీసుల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమైన వారికి బీజేపీ ప్రమోషన్లు ఇస్తోందని.. దళితులు, ఆదివాసీల పట్ల ఆ పార్టీకి గౌరవం లేదని ఆయన అన్నారు.

భట్టి విక్రమార్క తమను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా భావించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్ రావు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులు భట్టి విక్రమార్క తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోహిత్ వేముల కేసు దర్యాప్తు ఇప్పటికే ముగిసిందని.. దానికి ఎవరూ బాధ్యులు కాదని న్యాయస్థానంలో తేలిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దళిత సమాజాన్ని రాజకీయంగా వాడుకునేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని రాంచందర్ రావు విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications