వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీకి మీ సాయంకావాలి: బాబుతో కడియం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గంలోని కమలాపురంలో గల కాగితం గుజ్జు పరిశ్రమ పునరుద్ధరణ (రేయాన్స్ ఫ్యాక్టరీ)ను తెరిపించే క్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మంగళవారం కలిశారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహకారంతో ఏపీ రేయాన్ (బల్లార్‌పూర్)ను తిరిగి తెరిపించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాజకీయాలకు అతీతంగా వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ, తెరాస, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రబాబును కడియం కలిశారు.

బాబును కలిసిన వారిలో కడియం శ్రీహరితో పాటు మహబూబూబాద్ ఎంపీ సీతారామ్ నాయక్, టీడీపీ రాజ్యసభ సభ్యులు గరికపాటి రామ్మోహన్ రావు, రేయాన్స్ ఫ్యాక్టరీ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. రేయాన్స్ పరిశ్రమను తెరిపించేందుకు తన వంతు సహకారం చేస్తామని చంద్రబాబు చెప్పారని కడియం శ్రీహరి అన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ బాబు సహకరిస్తామని చెప్పారన్నారు.

 కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

పార్టీ వీడి వెళ్లిన తర్వాత తొలిసారి తనవద్దకు వచ్చిన కడియం శ్రీహరిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయంగా పలకరించారు. టీడీపీకి రాజీనామా చేసి తెరాసలో చేరిన తర్వాత చంద్రబాబు కార్యాలయానికి శ్రీహరి రావడం ఇదే ప్రథమం.

 కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని చంద్రబాబు కార్యాలయానికి వచ్చిన తొలి తెరాస మంత్రి కూడా ఆయనే. పది రోజుల క్రితం ఇదే బృందం ఈ సమస్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కూడా కలిసింది.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

కడియం బృందం తనవద్దకు రాగానే చంద్రబాబు సీట్లో నుంచి లేచి నిలబడి వారిని సాదరంగా ఆహ్వానించి, ఆత్మీయంగా పలకరించారు.

 కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

క్షేమసమాచారాల వాకబు తర్వాత రేయాన్స్‌ ఫ్యాక్టరీ విషయంలో లోగడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు కడియం గుర్తు చేశారు. సుమారు అరగంటపాటు వారు చంద్రబాబు వద్ద ఉన్నారు.

 కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

రేయాన్స్‌ పరిశ్రమ గతఏడాది మూతపడడంతో వేలాది కార్మికులు ఉపాధిని కోల్పోయారని బాబుకు కడియం తెలిపారు. పరిశ్రమను తిరిగి ప్రారంభించబోతున్నట్లు, ఇందుకు సహకరించాలని బాబును కడియం కోరారు.

English summary
Telangana Deputy CM Kadiyam Asks Chandrababu For Help
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X