హైదరాబాద్‌లో ఏపీ పోలీస్, ఏపీ నేతలపై తెలంగాణ డీజీపీ హెచ్చరిక!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేతలందరికీ తాము భద్రతను ఉపసంహరించుకుంటామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ హెచ్చరించారు. హైదరాబాదులో ఏపీ పోలీసులను మోహరించడం పైన డీజీపీ మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన... హైదరాబాదులో సెక్యూరిటీ బాధ్యత తమదేనని గవర్నర్‌కు వివరించారని తెలుస్తోంది. హైదరాబాదులో ఏపీ పోలీసులు మోహరింపు పైన డీజీపీ అనురాగ్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగైతే మొత్త ఏపీ నేతల సెక్యూరిటీ ఉపసంహరించుకుంటామని చెప్పారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి ధైర్యంగా ఉన్నారు: మోత్కుపల్లి
చర్లపల్లి జైలులో ఉన్న రేవంత్ రెడ్డి చాలా ధైర్యంగా ఉన్నారని తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం చెప్పారు. ఆయన జైలులో రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ రెడ్డిని కేసులో ఇరికించారని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలన్న ప్రయత్నాలు ఫలించవన్నారు.
చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అవకాశం
ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ దర్యాఫ్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేసేందుకు అవకాశం ఉన్నదని తెలుస్తోంది. త్వరలో ఎప్పుడైనా నోటీసులు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని వార్తలు వస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఉన్నతస్థాయి నుంచి అనుమతి లభించినట్లుగా తెలుస్తోందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్‌కు, సీఎం కేసీఆర్‌కు సమాచారం అందించారని తెలుస్తోంది. డీజీపీ అనురాగ్ శర్మతో పాటు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గవర్నర్‌తో భేటీ కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications