కేసీఆర్ ప్రభుత్వంలో కీలక అధికారి ప్రణీత్ రావుపై వేటు: మరో 47 మంది డీఎస్పీల బదిలీ
తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సస్పెండ్ చేస్తూ డీజీపీ రవిగుప్తా సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం డీజీపీ కార్యాలయానికి ఆయనను ప్రభుత్వం అటాచ్ చేసింది.
ఈ క్రమంలోనే ప్రణీత్ రావుపై వేటు పడటం గమనార్హం. అయితే, గతంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలను ప్రణీత్ రావు ఎదుర్కొన్నారు.

47 మంది డీఎస్పీల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. ఒకేసారి 47 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవి గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఒక పార్లమెంట్ పరిధిలో గత నాలుగేళ్లలో మూడు సంవత్సరాలపాటు పనిచేసినవారిని బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టారు.
యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు
యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) భాస్కర్ రావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆయనను సస్పెండ్ చేస్తూ తెలంగాణ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని నల్గొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో నాలుగేళ్ల నుంచి విధులు నిర్వహిస్తూ.. ఇంకా మూడేళ్లు పూర్తి కాలేదని తప్పుడు నివేదిక ఇవ్వడంతో విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications