TS EAPCET 2024: తెలంగాణ ఈఏపీసెట్ నోటిఫికేషన్ నేడే విడుదల
TS EAPCET: బుధవారం అంటే ఫిబ్రవరి 21వ తేదీన తెలంగాణ ఈఏపీసెట్ -2024 నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు జేఎన్టీయూ హైదరాబాద్ ప్రకటించింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీఎస్ ఈఏపీసెట్ ను జేఎన్టీయూ నిర్వహిస్తోంది. బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసి, 26వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ఏప్రిల్ 6వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు తమ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ మధ్యలో విద్యార్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. రూ. 250 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 9వ తేదీ వరకు, రూ. 500 ఆలస్యం రుసుంతో ఏప్రిల్ 14వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 2500 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 19 వరకు, రూ. 5000 ఆలస్య రుసుంతో మే 4వ తేదీ వరకు దరఖాస్తు సమర్పించవచ్చు.

ఇక, మే 1వ తేదీ నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 9, 10వ తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు, మే 11, 12 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఈ ఏడాది ఫస్టియర్, సెకండియర్‌కు సంబంధించిన 100 శాతం సిలబస్‌తో టీఎస్ ఈఏపీ సెట్‌ను కండక్ట్ చేయనున్నారు. ప్రవేశ పరీక్ష ఇంగ్లీష్ - తెలుగు, ఇంగ్లీష్ - ఉర్దూ భాషల్లో ఉండనుంది. తెలుగు లేదా ఉర్దూ వెర్షన్‌లోని ప్రశ్నల్లో తేడాలుంటే ఇంగ్లిష్ వెర్షన్‌నే ఫైనల్‌గా తీసుకుంటారు. ఇతర వివరాల కోసం 7416923578, 7416908215 హెల్ప్ లైన్ నంబర్లకు కాల్ చేయవచ్చని సూచించారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications