తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ రిలీజ్.. టాపర్స్ వీళ్లే !
తెలంగాణ ఎడ్‌సెట్ (TG EdCET 2025) ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి కె. ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు రిజల్ట్స్ రిలీజ్ చేశారు.
కాగా ఎడ్‌సెట్ ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://edcet.tgche.ac.in ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం హాల్‌టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలు ఉపయోగించాలి. ఈ ఫలితాలతో, రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కోర్సులో చేరదలచిన విద్యార్థులకు మరో ముందడుగు పడింది. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ ఏడాది జూన్ 1న రెండు సెషన్‌ల్లో బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఎడ్‌సెట్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష అనంతరం విడుదల చేసిన ప్రాథమిక కీ (Primary Key) పై అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత అధికారులు ఫైనల్ కీను తయారుచేసి, అదే ప్రకారం ఫలితాలను ప్రకటించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని పరీక్ష నిర్వహకులు తెలిపారు.
ఈ ఎగ్జామ్ కోసం మొత్తం 38,758 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 32,106 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులలో 30,944 మంది అర్హత సాధించగా.. 96.38%గా ఉత్తీర్ణత శాతం నమోదైంది.
టాప్ ర్యాంకర్స్ వీళ్లే..
ఈ సంవత్సరం ఎడ్‌సెట్‌లో టాప్ స్కోర్లు సాధించినవారిలో ఫస్ట్ ర్యాంక్ గణపతి శాస్త్రి (హైదరాబాద్)కి వచ్చింది. అలానే శరత్‌చందర్ (హైదరాబాద్), నాగరాజు (వరంగల్) అభ్యర్థులు రెండవ, మూడవ ర్యాంకుల్లో నిలిచారు. వారిని పలువురు ప్రముఖులు అభినందించారు.












Click it and Unblock the Notifications