ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోధన.. ఎన్జీవో సంస్థలతో విద్యాశాఖ ఒప్పందం

జూన్ 12 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున: ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్ కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ క్లాసులు ప్రారంభించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ విధానం అమలు కానుంది. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 571 పాఠశాలలు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

అయితే తాజాగా మరో సంచలన ఒప్పందం చేసుకుంది రాష్ర్ట ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధనా సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తున్న వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇకనుంచి అధునాతన ఎడ్‌ టెక్​ సదుపాయాలు అందనున్నాయి.

ఈ మేరకు వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న స్వచ్చంద సంస్థలతో రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. రోహిణి నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్‌ స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజమ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో విద్యా శాఖ MOU కుదుర్చుకుంది.

Telangana Education Dept Inks Deals with NGOs for Free Technical Education

రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచాలన్న సీఎం రేవంత్ నిర్ణయం మేరకు ఆయా సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. దేశంలో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో #EdTech సదుపాయాలు కల్పించడం వల్ల రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంది.

కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్‌ ఫారమ్‌ తో @EkStep_Org 540 పాఠశాలలలో పని చేస్తుంది. ఇకపై 33 జిల్లాల పరిధిలో 5 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు భాషలతో పాటు మ్యాథ్స్​ బేసిక్స్ ​ను ఈ సంస్థ అందిస్తుంది. అంతేకాక ఇంటర్​ విద్యార్థులకు నీట్​, జేఈఈ, క్లాట్​ పరీక్షలకు @PhysicswallahAP సన్నద్ధులను చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తుంది.

రాష్ట్రంలో 6వ తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల పాఠ్యాంశాలకు అనుగుణంగా
@khanacademy వీడియో ఆధారిత STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) శిక్షణను అందజేస్తుంది. #Prajwala ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్​ 12 వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు @pijamfoundation కోడింగ్ మరియు కంప్యూటేషనల్ థింకింగ్‌ పై శిక్షణను అందిస్తుంది.

@educate_girls రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు, బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరచం కోసం పనిచేస్తుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+