అప్పటి వరకు మద్యం, కల్లు దుకాణాలు బంద్: 144 సెక్షన్ అమలు
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. గత కొద్ది వారాలుగా హోరెత్తించిన మైకులు మూగబోయాయి. ప్రచారం పరిసమాప్తితో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు ఆయా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోయారు. నేటి సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలు కానుంది.
శాసనసభ ఎన్నికలకు అక్టోబర్ 9వ తేదీన ప్రకటన వెలువడగా.. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, ప్రకటన కంటే ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక ప్రచార పర్వం మరింత ఉద్ధృతంగా సాగింది. ఇక, అధికార భారత్ రాష్ట్ర సమితి(BRS)తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి.

ఇక, మజ్లిస్, బీఎస్పీ, వామపక్షాలు సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా జోరుగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాయి. ఆయా పార్టీల తరపున అగ్రనేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొన్నారు. అధికార పార్టీని, ప్రత్యర్థి పార్టీలను విమర్శలు చేస్తూ.. హామీల వర్షం కురిపించారు. ఆయా పార్టీల తరపున ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. గత కొన్నాళ్లుగా సాగిన ప్రచార హోరు మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.
ఈ క్రమంలో పోలింగ్‌కు 48 గంటల ముందుగా సైలెన్స్ పీరియడ్ ప్రారంభమైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గానూ.. 13 నియోజకవర్గాల్లో పోలింగ్ 30వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. దీంతో ఆ 13 నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం నాలుగు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి.
మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ ప్రారంభంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించడానికి అనుమతి లేదు. సోషల్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారం చేయకూడదని ఈసీ స్పష్టం చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్
నవంబర్ 30న ఎన్నికలు జరగనుండటంతో నేటి సాయంత్రం నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ప్రలోభాల కట్టడిపై ప్రధానంగా పోలీసులు, ఎన్నికల అధికారులు దృష్టి సారించారు. ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు నిఘా మరింత పటిష్ఠం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నారు.
మద్యం షాపులు బంద్
హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు సీపీ సందీప్ శాండిల్య తెలిపారు. మంగళవారం నుంచి నవంబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయనున్నట్లు తెలిపారు. ఎన్నికలు ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications