ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. చివరి నిముషంలో నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి!!
తెలంగాణ శాసనసభ ఎన్నికలలో నేటితో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30 తేదీన జరగనున్న ఎన్నికలకు అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాలలో బహుముఖ పోటీ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల తుది జాబితా నేడు కూడా విడుదల చేయగా, నామినేషన్ల దాఖలుకు ఈరోజు చివరి రోజు కావటంతో నామినేషన్లు పోటెత్తాయి.
ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈనెల 15తో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. ఈనెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. కాగా నిన్నటి వరకు 119 నియోజకవర్గాలకు 1,133 మంది అభ్యర్థులు 1169 నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ కార్యాలయం తెలిపింది.

గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గం రైతులు ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో ఆఖరి నిమిషంలో రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తి కావడంతో ఇక అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూకుడును కొనసాగించనున్నారు. ఈ సారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అన్ని ప్రధాన పార్టీలు అమీ తుమీ తేల్చుకునే పనిలో పడ్డాయి. వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఓటర్ల మనసు గెలుచుకునే పనిలో పడ్డారు.












Click it and Unblock the Notifications