telangana elections: ప్రతీ ఓటరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయమిది!!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల వేడి పీక్స్ కు చేరుకుంది, ఎన్నికలలో ఓటు వేసేందుకు ఓటర్లు సిద్ధం అవుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికలలో భాగంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ ఉండటంతో రాజకీయ పార్టీల హడావుడి కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మరింత ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలని ఎన్నికల అధికారులు స్వీప్ ద్వారా అవగాహనా కార్యక్రమాలను కొనసాగించారు.

చాలా చోట్ల విద్యావంతులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. కానీ ఈసారి కొత్త ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకోవటం మాత్రమే కాక , స్వీప్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటింగ్ శాతం పెంచటం కోసం అధికారులే కాదు పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి.

telangana elections: Important thing every voter should remember!!

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే ఆయుధం అని అధికార యంత్రాంగం చెప్తోంది. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు ఉపయోగించుకోవాలని కోరుతుంది. ఓటు వేసేందుకు వెళ్ళే ప్రతీ ఓటరు పోలింగ్ కు ముందు ఓటరు ప్రతిజ్ఞ ను గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. నిజాయితీ గల, సమర్ధులైన నాయకులను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఓటరు ప్రతిజ్ఞను ఒక్కసారి చదివి, మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుని ఓటు వెయ్యాలని అంటున్నారు.

భారతదేశ పౌరులమైన మేము,ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో , మనదేశ ప్రజాస్వామ్య, సాంప్రదాయాలను , స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ,ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని,మతం,జాతి,కులం,వర్గం,భాషా లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అంటూ ఓటరుగా చేసిన ప్రతిజ్ఞ గుర్తు తెచ్చుకుని ఓటు వెయ్యాలని అంటున్నారు.

ఓటును అమ్ముకోకూడదని గుర్తు చేస్తున్నారు. కానీ ఓటర్లు చాలావరకు ప్రలోభాలకు లొంగి ఓటు హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఈ ముఖ్యమైన ఓటరు ప్రతిజ్ఞను పదేపదే గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+