కాంగ్రెస్‌ను ముట్టుకున్నా..కరెంట్‌ను ముట్టుకున్నా మాడిపోతారు: భట్టి: ఆ ఘనత వైఎస్సార్‌దే

Bhatti Vikramarka: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. నేడు తమ నాయకుడిని ఎన్నుకోనుంది కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (CLP meeting). హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లాలో ఈ భేటీ ఏర్పాటైంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాకూర్, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, కొత్తగా గెలిచిన శాసన సభ్యులతో పాటు పలువురు సీనియర్ నేతలు, పరిశీలకులు దీనికి హాజరయ్యారు. సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది.

 Telangana elections result 2023: Congress leader Bhatti Vikramarka made key remarks

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన వెంటనే మేనిఫెస్టో అమలుపై దృష్టి సారిస్తామని అన్నారు. అందులో పొందుపరిచిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, ఆ నమ్మకంతోనే ప్రజలు తమను గెలిపించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీల అమలుపై త్వరలోనే తేదీలను ఖరారు చేస్తామని పేర్కొన్నారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై భట్టి మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్ అనే పథకం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరేనని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు ఫైలుపై సంతకం చేశారని గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్‌కు మాత్రమే పెటెంట్ ఉందని చెప్పారు.

రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ విద్యుత్ ఉత్పత్తి కావడానికి కూడా వైఎస్సార్ కారణమని భట్టి అన్నారు. ఆయన హయాంలో తెలంగాణలో నిర్మితమైన ప్రాజెక్టుల వల్లే ఇప్పుడు కరెంట్ వస్తోందని చెప్పారు. కాంగ్రెస్ అంటే కరెంట్, కరెంట్ అంటే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. కరెంట్‌ను ముట్టుకున్నా, కాంగ్రెస్‌ను ముట్టుకున్నా ఎలా మాడిపోతారో ఇప్పుడు చూశారు కదా? అని అన్నారు.

మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పాదయాత్ర చేశానని, గ్రామస్థాయిలో ప్రజల కష్టాలు ఎలా ఉంటాయనేది ప్రత్యక్షంగా చూశానని భట్టి పేర్కొన్నారు. దీని ఆధారంగానే మేనిఫెస్టోను రూపొందించామని, ప్రజల కష్టాలను తీర్చేలా తమ ప్రభుత్వ పనితీరు ఉంటుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+