ఉగాది నుంచి కేటీఆర్ జాతకం ఎలా ఉందంటే!
తెలుగు నూతన సంవత్సరం వచ్చేసింది. అందరూ ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యాలయాల్లో కూడా వైభవంగా ఉగాది వేడుకలు జరిగాయి. పాల్గొన్న పంచాంగకర్తలు ఏ పార్టీకి ఆ పార్టీకి అనుకూలంగా పంచాంగం చెప్పారు. అందరూ ఆసక్తిగా తిలకించారు. భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీకి సంబంధించి, కేసీఆర్, కేటీఆర్ కు సంబంధించి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో పండితులు తెలియజేశారు. దీనిపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) పంచాంగాన్ని పండితులు చెప్పారు. ఆయనది మకర రాశి. కొత్త సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని, మాటలను అదుపులో ఉంచుకొని మాట్లాడాలని సూచించారు. మకరరాశివారికి ఆదాయం 14, వ్యయం 14గా ఉంది. వీరికి రాజపూజ్యం 3గా ఉంటే అవమానం ఒకటిగా ఉంది. ఏ పని తలపెట్టినా ఎంతో అప్రమత్తంగా ఉండాలని, చిన్న పని అయినా, పెద్ద పని అయినా ఎంతో జాగ్రత్తగా చేయాలన్నారు.

మాటను నియంత్రించుకోవాలన్నారు. ఆచితూచి మాట్లాడటంవల్ల మంచి ఉపకారం జరుగుతుందన్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా బాగా కలిసివస్తుందని పండితులు తెలియజేశారు. ప్రజలు, పార్టీలో అందరినుంచి అభిమానం పొందుతారన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వస్తాయని, దోష నివారణకు మకర రాశివారు జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని సూచించారు. దీంతోపాటు రుద్రయాగం చేస్తే ఎంతో బాగుంటుందన్నారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి అధికారంలో లేదు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు దక్కించుకుంటుందనే విషయంలో కూడా ఆ పార్టీలోనే స్పష్టత రావడంలేదు. ఫోన్ ట్యాపింగ్ పై స్పందిస్తానని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దీనిపై రెండుమూడురోజుల్లో మాట్లాడతానన్నారు. ఆయన ఏం మాట్లాడతారా? అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications