1969 తెలంగాణ ఫైటర్ రఘువీర రావు మృతి

హైదరాబాద్: 1969 ప్రత్యేక తెలంగాణ పోరాయ యోధుడు, కవి, జర్నలిస్టు సంతపురి రఘువీర రావు (84) కన్ను ముశారు. 1969 జైతెలంగాణ ఉద్యమ నిర్మాతల్లో ఒకరుగా నిలిచిన ఆయన గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మెదక్ జిల్లా ములుగు మండలంలోని బండ నర్సింహపల్లి గ్రామానికి చెందిన సంతపురి రఘువీర రావుకు భార్య రమాదేవి, కుమారుడు వంశీకృష్ణ ఉన్నారు.

వీరు సైదాబాద్‌లో నివసిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రఘువీర్‌రావు గురువారం సాయంత్రం కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో దవాఖానలో కన్నుమూశారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాష్ట్రంలోఅనేక ప్రాంతాల్లో పర్యటించి ఉద్యమవ్యాప్తికి కృషి చేశారు. మర్రి చెన్నారెడ్డితో కలిసి జైలుకెళ్లారు. జన్‌సంఘ్‌లో పనిచేస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని పాతబస్తీ నుంచి శాసనసభకు పోటీ చేశారు.

Telangana fighter Raghuveer Rao passes away

జర్నలిస్టుగా సంతపురి రఘువీర్‌రావు నవశక్తి, ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ వంటి పత్రికల్లో సంపాదక సభ్యుడిగా పనిచేశారు. సనాతన సారథికి సంపాదకుడిగా వ్యవహరించారు. వేదమాత పత్రికను నడిపారు. కవిగా అన్వేషణ పేరుతో కవితా సంపుటిని విడుదల చేశారు. విద్యార్థి దశలోనే భారత స్వాతంత్య్ర సమరంలో చురుకుగా పాల్గొని జైలు జీవితం సైతం గడిపారు. మలిదశ ఉద్యమంలో టీఆర్‌ఎస్ పార్టీ అవిర్భావ సమయంలో అండదండలు అందించారు.

ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలిదశ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన సంతపురి రఘువీర్‌రావు మృతిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు ప్రగాఢ సంతాపం తెలిపారు. రఘువీర్‌రావు 1969లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి అనేక ప్రాంతాల్లో పర్యటించారని వెల్లడించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సమయంలో అండదండగా నిలిచారని పేర్కొన్నారు. ఆనారోగ్యంతో ఉన్నప్పటికీ స్వయంగా సెక్రటేరియట్‌కు వచ్చి తనను ఆశీర్వదించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేసుకున్నారు.

తెలంగాణ ఉద్యమంలో రఘువీర్‌రావు తనకుమార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి అండగా నిలుస్తామని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+