సీఎం రేవంత్ సంచలన నిర్ణయం.. వారికి రూ. 5 లక్షలు

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరదలలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల రూపాయల పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే చనిపోయిన జంతువులకూ పరిహారం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల భారీ వర్షాలు, వరదలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలం అయింది. అయితే వరదలలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పశువులు మరణిస్తే రైతులకు పరిహారం అందజేస్తామని తెలిపారు. మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. విపత్తుపై సమగ్ర నివేదికను రూపొందించి కేంద్రానికి ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. భారీ వర్షాలకు రాష్ట్రంలో జరిగిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Telangana Floods CM Revanth Reddy Announces 5 Lakh Compensation for Deceased Families

వరదలకు సంబంధించిన పూర్తి వివరాలను తక్షణమే కేంద్రానికి అందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. అలాగే రాష్ట్రంలోని చెరువుల పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం స్పష్టం చేశారు. అంతేకాక పంటలకు వచ్చిన నష్టం అంచనా వేయించి.. తక్షణమే నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+