రాజ్ భవన్లో వేడుకల్లో తమిళిసై; తెలంగాణా దశాబ్ది వేడుకలపై రాం చరణ్ ఆసక్తికరట్వీట్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు పలువురు తెలంగాణా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర సాధనలో అమరులైన వారికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఘనంగా నివాళి అర్పించారు. 84 లక్షల మంది రాష్ట్ర సాధన ఉధ్యమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు.

హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పాడ్డాక, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఐటీ , వ్యవసాయం, నీతి పారుదల, జీవ శాస్త్ర, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో రాష్ట్రం విశేష అభివృద్ధి సాధించిందని గవర్నర్ అన్నారు. జాతీయ రహదారుల రంగంలో అభివృద్ధి రెట్టింపయిందన్నారు. హైదరాబాద్ సహజవనరులతో అభివృద్ధి చెందిందన్నారు.

 ramcharantamilisai

అన్ని ప్రాంతాలకు అభివృద్ధి విస్తరిస్తేనే నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందనీ గవర్నర్ చెప్పారు. రాష్ట్ర సమగ్ర, సమతుల్య, సకల జనుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ దోహదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కోసం రాజ్ భవన్ చేపట్టిన చర్యలను ఆమె వివరించారు. రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని గవర్నర్ చెప్పారు. తన జీవితంలో ప్రతి నిముషం తెలంగాణ ప్రజల కోసమేనని గవర్నర్ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలపై స్పందించిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు అవుతుందన్నారు. ఈ పదేళ్లలో అన్ని రంగాలలో పురోగతి సాధించామని పేర్కొన్నారు.


అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి బంగారు తెలంగాణ కలను నిజం చేసుకుంటున్నామని రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా శుభాకాంక్షలు అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ తో కేటీఆర్ కు మొదటినుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ చేసిన ట్వీట్ పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+