విషాదం : కరోనాతో ఒకే కుటుంబంలో వరుసగా నలుగురు మృతి... 11 రోజుల్లోనే...

కరోనా మహమ్మారి మాటలకు అందని విషాదాన్ని మిగులుస్తోంది. కుటుంబాలకు కుటుంబాలనే కబళిస్తోంది. నిత్యం వేల సంఖ్యలు జనాలు కరోనా బలవుతూనే ఉన్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో కరోనా ఓ కుటుంబాన్ని కబళించింది. కేవలం 11 రోజుల తేడాతో ఒకే ఇంట్లో నలుగురు కరోనాతో మృతి చెందారు.

వివరాల్లోకి వెళ్తే... మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో మద్ది బిక్షం-మంగమ్మ(60) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు వీరన్న(42),ఉపేందర్(39) ఉన్నారు. ఇద్దరు అన్నాదమ్ములు ప్రభుత్వ ఉద్యోగులు. ఇద్దరికీ పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన రిటైర్డ్ అయిన భిక్షం,ఆయన సతీమణి మనుమలతో సంతోషంగా గడిపేవారు.

telangana four family members of a family died with covdi 19 within 11 days

అలాంటి కుటుంబాన్ని కరోనా ఊహించని కుదుపు కుదిపేసింది. మొదట భిక్షం కరోనా బారినపడ్డారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన ఆయన ఈ నెల 2న ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందారు. ఆ తర్వాత రెండు రోజులకు.. అంటే 4వ తేదీన పెద్ద కుమారుడు వీరన్న కూడా కరోనాతో మృతి చెందాడు. ఇద్దరు ఇంటి పెద్దలను కోల్పోయిన దు:ఖం నుంచి తేరుకోకముందే చిన్న కుమారుడు ఉపేందర్‌,తల్లి మంగమ్మలను కూడా కరోనా బలితీసుకుంది. ఈ నెల 11న ఉపేందర్,13న మంగమ్మ కరోనాతో మృతి చెందారు.

కేవలం 11 రోజుల వ్యవధిలోనే ఒకే కుటుంబంలో నలుగురు కరోనాతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. నలుగురు పెద్దలను కోల్పోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. బాధిత కుటుంబం రోధనలు స్థానికులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి.

Recommended Video

    #Corona : 110 Year Old Man Recovers From Coronavirus కరోనాను జయించిన వృద్ధుడు

    రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఒకే కుటుంబంలో ఐదుగురు కొద్ది రోజుల వ్యవధిలోనే కరోనాకు బలైపోయారు. స్థానిక శ్రీరామ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రిటైర్డ్ టీచర్ మహమ్మద్ ఫరుద్దీన్ షా,ఆయన తల్లి,భార్య,కుమార్తె,కుమారుడు వరుసగా కరోనా బారినపడి మృతి చెందారు. గత నెల 4వ తేదీ నుంచి 29వ తేదీ మధ్యలో వీరు కరోనాతో మృతి చెందారు. ఒకేసారి ఐదుగురు కుటుంబ సభ్యులను కోల్పోవడంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. చిన్న కుమారుడు జిలానీ,వదిన గౌసియా,ఆమె పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓవైపు కుటుంబ సభ్యులు దూరమయ్యారన్న ఆవేదన... మరోవైపు వారి వైద్యం కోసం చేసిన రూ.20లక్షలు అప్పు ఎలా తీర్చాలో తెలియక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+