కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ గాంధీ ఇకలేరు: కెసిఆర్ నివాళి(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కరీంనగర్/హైదరాబాద్: తెలంగాణ గాంధీగా పేరు తెచ్చుకున్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు (బోవేరా) (95) సోమవారం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన వెంకటరామారావు జాతీయ స్వాతంత్ర ఉద్యమం, నిజాం విమోచనా ఉద్యమంలో పాల్గొనడంతోపాటు జైలుశిక్షను అనుభవించారు. బోవెరా మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.

1920 సెప్టెంబర్‌ 2న రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు బోయినపల్లి వెంకట్రామారావు జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లిలో పద్మనాయక వంశంలో జన్మించారు. ప్రాథమిక విద్య తోటపల్లిలో ప్రారంభమైంది. అనంతరం కరీంనగర్‌లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చేరారు. కొద్ది రోజుల్లో కాశ్మీరగడ్డలోని ప్రభుత్వ పాఠశాలలోకి మారారు. సామజిక, రాజకీయ కార్యకలాపాలతో చదువుకు ప్రాధాన్యమివ్వలేదు. 1939లో ఆంధ్ర సారస్వత పరిషత్‌ ద్వారా మెట్రిక్యులేషన్‌ పరీక్ష రాశారు. ఉత్తీర్ణత అనంతరం చదువునిలిపివేశారు. అయినా ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు.

జిల్లాలో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో బోవెరా పాత్ర కీలకం. ఆ సమయంలో జాతీయవాదులను 40మందిని సమీకరించారు. ప్రభుత్వ కార్యాలయాలు కూల్చేసి గిడ్డంగుల్లోని బియ్యాన్ని ప్రజలకు సరఫరా చేశారు. ప్రతిగ్రామంలోనూ జాతీయ జెండా ఎగురవేశారు. నైజాం ప్రభుత్వానికి సమాంతరంగా గ్రామాల్లో ప్రభుత్వాన్ని నడిపారు. ఆయన 65సంవత్సరాల క్రితం దేవులపల్లి రామానుజరావు సాహితీ స్ఫూర్తితో కరీంనగర్‌లో సారస్వతజ్యోతి మిత్రమండలిని స్థాపించి రికార్డు స్థాయిలో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు.

వినో బా బావే, జయప్రకాశ్‌ నారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య, మల్లాది సుబ్బమ్మ వంటి ప్రముఖులతో పనిచేశారు. 1952లో ఎలగందుల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా, 1957లో ఇందుర్తి నియోజకవర్గం నుంచి ప్రజా సోషలిస్టు పార్టీ ఆప్‌ ఇండియా అభ్యర్థిగా పోటీచేశారు. దివంగత కొండా నేత లక్ష్మణ్ బాపూజీతో కలిసి నిరుడు తెలంగాణ కోసం ఢిల్లీలో నిరాహారదీక్ష చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన ప్రధాని ఇందిరాగాంధీనుంచి తామ్ర పత్రాన్ని స్వీకరించారు. 2006లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌నిచ్చి సత్కరించింది.

గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఆయనకు ఒక కుమారుడు, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కొద్దిసేపు ఉంచాక, సాయంత్రం వరకు కరీంనగర్‌కు తీసుకొచ్చారు. మంగళవారం మధ్యాహ్నం కరీంనగర్‌లో బోవేరా అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల కోసం బంధువులు, సాహితీ మిత్రులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

బోవెరా

బోవెరా

తెలంగాణ గాంధీగా పేరు తెచ్చుకున్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రచయిత డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు (బోవేరా) (95) సోమవారం హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచారు.

ఆంధ్రమహా సభలో..

ఆంధ్రమహా సభలో..

కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన వెంకటరామారావు జాతీయ స్వాతంత్ర ఉద్యమం, నిజాం విమోచనా ఉద్యమంలో పాల్గొనడంతోపాటు జైలుశిక్షను అనుభవించారు.

ఆంధ్రమహా సభలో..

ఆంధ్రమహా సభలో..

1920 సెప్టెంబర్‌ 2న రంగమ్మ, కొండాల్‌రావు దంపతులకు బోయినపల్లి వెంకట్రామారావు జిల్లాలోని బెజ్జంకి మండలం తోటపల్లిలో పద్మనాయక వంశంలో జన్మించారు.

కెసిఆర్‌తో ఆలింగనం

కెసిఆర్‌తో ఆలింగనం

గాంధీ మాటల నెపుడూ వినరండోయ్‌.. గాంధీ మార్గమునం దె నడువండోయ్‌.. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యము కాంచగా జనులంత కదలండోయ్‌ వంటి పాటలు, మాటలతో అందరినీ ఉత్తేజపరిచే వ్యక్తి, మహాశక్తి డాక్టర్‌ బోయినపల్లి వెంకట్రామారావు.

కెసిఆర్‌తో బోవెరా

కెసిఆర్‌తో బోవెరా

కరీంనగర్‌లోని మానేరు తీరాన మంగళవారం అధికార లాంఛనాలతో బోవెరా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కార్యాక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు

కరీంనగర్‌లోని మానేరు తీరాన మంగళవారం అధికార లాంఛనాలతో బోవెరా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కార్యాక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, మంత్రి హరీశ్ రావు హాజరుకానున్నట్లు టిఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు పోలీసు వర్గాలకు అధికారిక సమాచారం అందినట్లు తెలిసింది. ఎల్‌ఎండీ డ్యామ్‌ కట్టను ఆనుకొని ఉన్న మార్కండేయనగర్‌ శ్మశాన వాటికలోని ఎస్సారెస్పీ స్థలంలో బోవేరా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సమీపంలోనే తాత్కాలిక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.

English summary
Veteran freedom fighter and Gandhian Boinapalli Venkata Rama Rao (96) passed away at a hospital in Hyderabad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X