దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపు-ఆ విషయంలో దేశంలోనే నంబర్.1 : మంత్రి హరీశ్ రావు

దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపయిందని... రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకెళ్తోందని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. జీఎస్‌డీపీలో దేశంలోనే మూడో స్థానం, దక్షిణాదిలో మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా ఒక శాతం జీడీపీ పెరుగుతూ వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేస్తున్న విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు.రాష్ట్రంలో సంపద పెరుగుదల, ఆర్థిక పరిస్థితిపై హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) కార్యాలయంలో మంత్రి హరీశ్‌ రావు మీడియాతో మాట్లాడారు.

ఆ విషయంలో దేశంలోనే టాప్-1..

ఆ విషయంలో దేశంలోనే టాప్-1..

పన్నువసూళ్లలో 11.52 శాతంతో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో దేశ వృద్ధిరేటు 3.6 శాతంగా ఉంటే.. తెలంగాణ వృద్ధి రేటు 14.3 శాతంగా ఉందన్నారు. తయారీ రంగంలో 72 శాతం, ఐటీ రంగంలో 120 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, గ్రామీణ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 14.5 శాతం అధిక వృద్ధిరేటు సాధించామని చెప్పారు.

రాష్ట్ర అభివృద్ది ఇలా...

రాష్ట్ర అభివృద్ది ఇలా...

పశువుల పెంపకం రంగంలో మూడు రెట్లు వృద్ది నమోదైందని.. చేపల పెంపకంలో ఆదాయం రెట్టింపు అయిందని హరీశ్ రావు పేర్కొన్నారు. వరి ఉత్పత్తిలో రూ.9,528 కోట్ల ఆదాయం నుంచి రూ.47,440 కోట్లకు ఆదాయం పెరిగిందన్నారు. తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉందన్నారు.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమేనని చెప్పారు. దాదాపు 30 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు ఉచితంగా కరెంటు ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే కోతలు లేని కరెంటు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. తద్వారా పరిశ్రమలు, సర్వీస్‌, నిర్మాణ రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామన్నారు.

కేంద్రం తీసుకునేది ఎక్కువ...ఇచ్చేది తక్కువ...

కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్లే నిధులు ఎక్కువ.. కేంద్రం మనకు ఇచ్చేది తక్కువ అని హరీశ్ రావు విమర్శించారు. దేశ జీడీపీ కాంట్రిబ్యూషన్‌లో తెలంగాణది ఆరోస్థానం అని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 4 శాతం ఉన్న జీడీపీ ఇప్పుడు 5 శాతానికి పెరిగిందన్నారు. కరోనా ఏడాదిలోనూ 2.4 శాతం వృద్ధిరేటు సాధించామన్నారు.

దేశంలో జీడీపీ వృద్ధి మైనస్‌ 3 శాతంగా నమోదైందని గుర్తుచేశారు. బంగ్లాదేశ్‌ కంటే భారత్‌ వృద్ధిరేటు చాలా తక్కువగా ఉందని... ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గుర్తించాలన్నారు. సీఎం కేసీఆర్‌ అవలంభించే విధానాలతోనే తెలంగాణ వృద్ధిరేటు పెరుగుతున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థల నివేదికల ఆధారంగానే తాము ఈ విషయాలు చెబుతున్నామన్నారు.

బంగ్లా కంటే వెనుకంజలో భారత్

బంగ్లా కంటే వెనుకంజలో భారత్

బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 1887 డాలర్లు కాగా, భారత్‌ తలసరి ఆదాయం 1877 డాలర్లుగా ఉందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,37,638గా ఉందన్నారు. తలసరి ఆదాయాన్ని చూస్తే ఎవరి పనితీరు ఎలా ఉందో అందరికీ అర్థమవుతుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం 11.5 శాతం ఉంటే.... దేశ తలసరి ఆదాయం 4 శాతంగా ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పురోగతి సాధించామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలో తలసరి ఆదాయంలో 10వ స్థానంలో ఉన్నామని, ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నామని చెప్పారు. దేశ జీడీపీ ఎందుకు తగ్గిందో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+