హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Telangana gets zero: సిటీలో మోడీ లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ పోస్టర్లు!

ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. 'తెలంగాణ గెట్స్ జీరో ఇన్‌ యూనియన్‌ బడ్జెట్‌' అంటూ గురువారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు.. పెద్ద పోస్టర్‌ వేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పార్లమెంటులో బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023పై ఇప్పటికే బీఆర్ఎస్ మంత్రులు, నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణకు ఈ బడ్జెట్‌లో ఇచ్చింది శూన్యమంటూ మండిపడుతున్నారు. తాజాగా, తమ నిరసనను తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ నగరంలో భారీ పోస్టర్ హోర్డింగులను ఏర్పాటు చేశారు.

ప్రధాని మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. 'తెలంగాణ గెట్స్ జీరో ఇన్‌ యూనియన్‌ బడ్జెట్‌' అంటూ గురువారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు.. పెద్ద పోస్టర్‌ వేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను నగరంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సభ్యులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి కేటాయింపులు లేవని మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతోపాటు బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Telangana gets zero: BRS puts up poster in Hyderabad, targeting PM Modi over Union budget 2023

కాగా, గత ఏడాది కూడా బీజేపీ జాతీయ కార్యవర్గం సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు 'మనీ హీస్ట్' పోస్టర్‌లు వేశారు. మోడీ బహిరంగ సభ వేదిక దగ్గర పింక్ బెలూన్‌లను కూడా ఉంచడం ద్వారా బీఆర్ఎస్ తన సోషల్ మీడియా స్ట్రాటజీని అమలు చేసింది.

బీజేపీ జాతీయ కార్యవర్గం చివరి రోజు, సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీకి కొన్ని గంటల ముందు00 వేదిక వెలుపల 'జై జై కేసీఆర్' అనే బీఆర్ఎస్ నినాదంతో పింక్ బెలూన్‌లను గాలిలో ఎగురవేశారు. అవిబీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం వేదిక నుంచి ప్రముఖంగా కనిపించాయి.

రూ.7 లక్షల వరకు ఐటీ రాయితీ తెలంగాణకు ఉపయోగం లేదన్నారు కవిత.కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయంపై (కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విధంగా) ఆదాయపు పన్ను రాయితీ వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కవిత చెప్పారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమే ఈ బడ్జెట్ అని విమర్శించారు.

English summary
Telangana gets zero: BRS puts up poster in Hyderabad, targeting PM Modi over Union budget 2023.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X