తెలంగాణ రెవెన్యూ శాఖలో 10,954 ఉద్యోగాలు

Telangana: తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రెవన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారిక పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Government Announces 10 954 New Jobs in Revenue Department

మాజీ వీఆర్వోలు, మాజీ వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలను చేపట్టనున్నారు. త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆర్థిక శాఖ కోరింది. అయితే ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేబినెట్ నిర్ణయం మేరకు జీపీవో పేరుతో 10,954 పోస్టుల భర్తీకి ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుండగా.. గతంలో వీఆర్వోలుగా పని చేసి ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న 6 వేల మందిని జీపీవోలుగా నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అదనంగా 4వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. ఉగాదిన నుంచి అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. మొత్తం 61,579 పోస్టుల జాబితాను సిద్ధం చేసిన సర్కారు.. ఉగాది తర్వాత వారం లేదా పది రోజుల్లో 55 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 58, 868 పోస్టులను భర్తీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+